అల్లూరిజిల్లా అనంతగిరి త్రినేత్రం న్యూస్ జూలై 8 : అనంతగిరి, పాడేరు, చింతపల్లి మండలాల్లో హైడ్రో పవర్ ప్రాజెక్టుల కోసం ప్రభుత్వం సర్వేలు చేపట్టిందన్న వార్తలపై జనసేన పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ప్రభుత్వం స్థానిక గిరిజనుల అభిప్రాయాలు, మేధావుల ఆలోచనలను పక్కన పెట్టి పర్యావరణానికి హాని కలిగే విధంగా ప్రాజెక్టులపై ముందుకు సాగడాన్ని జనసేన వ్యతిరేకిస్తోంది.
గతంలో చింతపల్లి మండలంలోని పెదబరాడ పంచాయతీ ఎర్రవరం హైడ్రో ప్రాజెక్ట్ ఉదాహరణగా చూపుతూ, అప్పుడు వైసీపీ నాయకులు గ్రామ సభల సమ్మతి లేకుండానే ప్రాజెక్టును ఆమోదించారని, ప్రజల నిరసనల్ని పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు. ఇప్పుడు అదే తంతు మళ్లీ పునరావృతం కాకూడదని జనసేన నేతలు హెచ్చరిస్తున్నారు.
“గిరిజనుల జీవనశైలి, హక్కులు పరిరక్షించడంలో జనసేన కట్టుబడి ఉంది. ఈ విషయాన్ని మా అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లి, తగిన చర్యలు తీసుకునేలా చూస్తాం,” అని జనసేన నేత చిట్టం మురళి తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


