MLA TRR : మంత్రి కి శుభాకాంక్షలు తెలిపిన పరిగి ఎమ్మెల్యే TRR

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం : తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా ఇటీవల కార్మిక ఉపాధి, శిక్షణ, కర్మాగారాములు, గనులు మరియు భూగర్భ శాఖ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలు చేపట్టిన ఉమ్మడి మెదక్ జిల్లా ఇంచార్జి మంత్రిగా గౌరవనీయులు గడ్డం వివేక్ వెంకటస్వామిని సచివాలయంలోని వారి ఛాంబర్ లో సంగారెడ్డి జిల్లా అబ్జర్వర్, పరిగి ఎమ్మెల్యే వికారాబాద్ డి.సి.సి అధ్యక్షులు డాక్టర్ టి.రామ్మోహన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా మంత్రి కి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో సత్కరించి హార్దిక శుభాకాంక్షలు తెలియజేశారు.మంత్రిగా ప్రజలకు సేవచేసే పనిలో ఆయన విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కో-అబ్జర్వర్ దయాకర్ , కాంగ్రెస్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ నవాబ్ ముజాహిద్ ఆలం ఖాన్, పటాన్ చెర్వు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ ,తదితర నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Parigi MLA TRR congratulates

You cannot copy content of this page

Scroll to Top