Donation : పోలీసు మృతుల కుటుంబాలకు రూ 31 లక్షల విరాళం

TRINETHRAM NEWS

ఆలమూరు : త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, విధి నిర్వహణలో కారులో ప్రయాణిస్తూ ప్రమాదవశాత్తు మృతి చెందిన ఆలమూరు ఎస్సై ఎం,అశోక్, కానిస్టేబుల్‌ ఎస్‌.బ్లెస్సన్‌ కుటుంబాలకు రూ 31 లక్షల ఆర్థికసాయం వితరణ జరిగింది. 2009లో అప్పటి ఉమ్మడి (ఆంధ్రా, తెలంగాణ) రాష్ట్రంలో ఎస్సైలుగా నియమితులైన సుమారు 1100 మంది ఈవిరాళాన్ని సమకూర్చుకున్నారు. అందులో భాగంగా ఎస్సై అశోక్‌ నివాసమైన పశ్చిమ గోదావరి జిల్లాలోని నరసాపురం వెళ్లి కుటుంబసభ్యులకు రూ 26 లక్షల చెక్కును అందజేశారు.

అనంతరం ఎస్సై అశోక్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అలాగే ఆలమూరులోని కానిస్టేబుల్‌ బ్లెస్సన్‌ నివాసానికి వచ్చి అతని కుటుంబసభ్యులకు రూ ఐదు లక్షల చెక్కును అందజేశారు. అనంతరం కానిస్టేబుల్‌ బ్లెస్సన్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కర్తవ్య నిర్వహణలో మృతి చెందిన తమ సహచర ఉద్యోగులైన ఎస్సై అశోక్, కానిస్టేబుల్‌ బ్లెస్సన్‌ రుణం ఎన్నటికీ తీర్చుకోలేదని రావులపాలెం రూరల్‌ సీఐ సీహెచ్‌.విద్యాసాగర్‌ వ్యాఖ్యానించారు. మృతుల కుటుంబాలకు తమ వంతు సాయంగా ఈవిరాళాన్ని అందించినట్లు వివరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Rs 31 lakh donation to

You cannot copy content of this page

Scroll to Top