Guru Puja Mahotsava : గురుపూజ మహోత్సవ

TRINETHRAM NEWS

తేదీ : 06/07/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నం నగర ఆర్ఎస్ఎస్ విభాగం ఆధ్వర్యంలో వేడుక ఫంక్షన్ హాల్ లో గురుపూజ మహోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా, గూడూరుకు చెందిన ఆర్ఎస్ఎస్ రాష్ట్ర నాయకులు మాట్లాడుతూ ఈ ఆర్ ఎస్ ఎస్ ఏర్పడి వంద సంవత్సరాలు అయిందని , క్రమం తప్పకుండా ప్రతి ఏడాది అన్ని శాఖలలో గురుపూజ మహోత్సవం జరుగుతున్నట్లు తెలియజేయడం జరిగింది. భారతదేశం వ్యాప్తంగా హిందువుల హక్కులు, ధర్మ పరిరక్షణ కోసం నిరంతరం కృషి చేస్తుందని అన్నారు. హిందువులు మనోభావాన్ని దెబ్బ తీసే విధంగా ఎవరు ప్రయత్నించిన సహించేదే లేదని స్పష్టం చేశారు.

ప్రతి హిందూ బంధువు ఇతర హిందువుల సంక్షేమం కోసం కృషి చేయాలని, ఆర్ఎస్ఎస్ విభాగంలో కాషాయ జెండాకు సుప్రీం స్థానమని ప్రతి ఒక్కరు గురువుతో సమానంగా జెండాను గౌరవించాలని, తెలిపారు. ఈ రాష్ట్రం మచిలీపట్నంలో ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎల్. బాలాజీ (న్యాయవాది) మాట్లాడుతూ పందొమ్మిది వందల ఇరవై ఐదు వ సంవత్సరంలో స్థాపించిన ఆర్ఎస్ఎస్ దేశ వ్యాప్తంగా విస్తరించి నిరంతరం సేవలందించడం అభినందనీయమన్నారు. ఏడాదికి జరిగే ఆరు పండుగలలో గురుపూజ మహోత్సవం ఒకటని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ గురువులను గుర్తు పెట్టుకోవాలని, సమాజంలో వాళ్లకి ఎప్పుడు అగ్రస్థానమేనని తెలిపారు.

చల్లపల్లి కి చెందిన నాయకులు కోనేరు. బలరాం, ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ చంద్రశేఖర్, మచిలీపట్నం వైద్యులు శ్రీహరి వేదికపై ఆసీనులయ్యారు. డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య బాలాజీ విద్యాలయం కరస్పాండెంట్ కొమరగిరి. చంద్రశేఖర్, డాక్టర్ ఉ డత్తు శ్రీనివాస్. న్యాయవాదులు కూనపు రెడ్డి శ్రీనివాస్, వడ్డీ. జితేంద్ర, మచిలీపట్నం మండల జనసేన పార్టీ నగర అధ్యక్షులు గడ్డం. రాజు, పట్టణ టూ వీలర్స్ మెకానిక్ అసోసియేషన్ అధ్యక్షులు కొల్లా .వెంకట సుబ్బారావు, రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ సత్యనారాయణ, గుప్తా. కృష్ణవేణి, ఐటిఐ కరెస్పాండెంట్ కొత్త గుండు. రమేష్, వేడుక ఫంక్షన్ హాల్ అధినేత ప్రసాద్ తదితర నాయకులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Guru Puja Mahotsava

You cannot copy content of this page

Scroll to Top