Kethawat Baburam Naik : చందంపేట ఎంఈఓ బాధ్యతలు సీనియర్ ఉపాధ్యాయులకే అప్పగించాలి

TRINETHRAM NEWS
కేతావత్ బాబురాం నాయక్, గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు విద్యార్థుల రాజకీయ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు. 

దేవరకొండ జూలై 05 త్రినేత్రం న్యూస్. దేవరకొండ నియోజకవర్గంలోని చందంపేట మండలంలో విద్యా పరిరక్షణ, సమర్థవంతమైన నిర్వహణ కోసం తక్షణం సీనియర్ ప్రధానోపాధ్యాయులకు ఎంఈఓ బాధ్యతలు అప్పగించాలి. 1996 డీఎస్సీ ద్వారా నియమితులై, 25 సంవత్సరాలకుపైగా అనుభవంతో ప్రస్తుతం పాఠశాలల్లో విధులు నిర్వహిస్తున్న సీనియర్ ప్రధానోపాధ్యాయులు చందంపేట మండలంలో ఉన్నారు. వీరికి ఎంఈఓ బాధ్యతలు అప్పగిస్తే విద్యా వ్యవస్థ మరింత బలోపేతం అవుతుంది.

గతంలో ఎఫ్.ఏ.సీ. విధానాన్ని అనుసరించి బాధ్యతలు అప్పగించడం వల్ల పలు ఘటనల్లో ఉపాధ్యాయులు స్కూల్‌కు హాజరు కాకుండా జీతాలు తీసుకోవడం, తరువాత సస్పెండ్ అవ్వడం వంటి పరిస్థితులు తలెత్తాయి. దీనివల్ల విద్యార్థుల భవిష్యత్తు హాని చెందింది. ఈ తప్పిదాలను పునరావృతం కాకుండా చూడాలంటే, తక్షణమే ఎఫ్.ఏ.సీ. విధానాన్ని విరమించి, సీనియర్ ప్రధానోపాధ్యాయులకు నియమించిన విధంగానే బాధ్యతలు అప్పగించాలి.

చందంపేట మండలంలోని పొగిళ్ల, కంబాలపల్లి వంటి మారుమూల గ్రామాల్లోని పాఠశాలలు 60 నుండి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ పాఠశాలలకు సమర్థవంతమైన పర్యవేక్షణ కోసం సీనియర్ ఉపాధ్యాయులే అనువైన వ్యక్తులు. వారు బాధ్యతలు చేపట్టినచో మూతబడ్డ పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. విద్యార్థులకు సరైన విద్యా అవకాశాలు కలుగుతాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యాభివృద్ధికి నూతన దిశగా చర్యలు తీసుకుంటుండగా, ఆయన సంకల్పాన్ని నిలబెట్టేందుకు స్థానిక స్థాయిలోనూ విద్యలో శుద్ధి, పారదర్శకత అవసరంవుందని,
విద్యా శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, చందంపేట మండల ఎంఈఓ బాధ్యతలు సీనియర్లకు అప్పగించి, ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని గిరిజన సంక్షేమ సంఘం తరపున బబురాం నాయక్ డిమాండ్ చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chandampet MEO responsibilities should

You cannot copy content of this page

Scroll to Top