Paramedical Staff : పారామెడికల్ సిబ్బంది క్యాడర్ స్కీం కొరకు ఏసీఎంవో, జి ఎం ల కి వినతి పత్రాన్ని ఇచ్చిన హాస్పిటల్ సిబ్బంది

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సింగరేణిలో పనిచేస్తున్న పారామెడికల్ సిబ్బంది ఐన వార్డ్ అసిస్టెంట్ లకి గ్రేడ్ హెచ్ ఇవ్వడం వలన ఆర్థికంగా నష్టపోతున్నామని, కోల్ ఇండియాలో అదే డెసిగ్నేషన్ కి గ్రేడ్ ‘ ఈ’ ఇస్తున్నారని ఏసీఎంవో దృష్టికి తీసుకెళ్లారు, సింగరేణిలో గ్రేడ్ ఈ చేరుకోవడానికి దాదాపు 20 సంవత్సరాల సమయం పడుతుందని తెలిపారు. దీనిపై సానుకూలంగా స్పందించిన ఏసీఎంవో డాక్టర్ అంబిక ఉన్నత స్థాయి అధికారుల దృష్టికి తీసుకెళ్తానని వార్డు అసిస్టెంట్స్ కి హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో ఏరియా హాస్పిటల్ సిబ్బంది దాసరి అనిల్, సంతోష్, భాస్కర్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Hospital staff who submitted

You cannot copy content of this page

Scroll to Top