Indiramma House : పేరుకే ఇందిరమ్మ రాజ్యం నెరవేరని పేదవాడి సొంత ఇంటి కల

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి) జూలై 05 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పథకాలలో ఇందిరమ్మ ఇల్లు ఒకటి. ముఖ్యమంత్రినే స్వయంగా పేదవాడికి ఇల్లు ఉండాలని ఆకాంక్ష తో తీసుకొచ్చిన పథకం ఇది కానీ రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న తతంగం వేరుగా అవుపిస్తుంది. ఏ గ్రామాలలో తీసుకున్న కాంగ్రెస్ పార్టీ అనుచురలకు మరియు నాయకులకు తప్ప చాలా గ్రామాలలో పేదవాడికి సొంత ఇంటికి కల కలగానే మిగిలింది. కారణం లీడర్ గా చలామణి అవుతూ పార్టీలు మారుస్తూ అధికార పార్టీలో చలామణి అవుతుందో నాయకులకు వారి అనుచరులకు మాత్రమే ఇందిరమ్మ ఇల్లు కట్టబెడుతున్నారని ఎంతోమంది పేదలు ఆవేదన చెందుతున్న విషయం కొంతమంది పేదవారికి పేరు ఇందిరమ్మ లిస్టులో వచ్చినా కూడా దానిని తీసేసి నాయకుడు అనుచరులకు ఇవ్వడం పెద్ద ఎత్తున విమర్శలకు దారితీస్తుంది.
ముఖ్యమంత్రి తీసుకున్న పథకాలలో అగ్రస్థానంలో ఉన్న పథకం ఇందిరమ్మ ఇల్లు అటువంటి పథకం పేదవాడికి చేరకుండా పక్కదారి పట్టడం పట్ల ఇది స్థానిక ఎన్నికలకు పెద్ద ఎత్తున పార్టీకి నష్టం వాటిల్లుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చాలా గ్రామాలలో ఈ పథకం పక్కదారి పట్టడం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The dream of a poor

You cannot copy content of this page

Scroll to Top