Dodla Venkatesh Goud : వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా పూలమాల వేసి నివాళులు అర్పించిన దొడ్ల వెంకటేష్ గౌడ్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జులై 4 : సామాజిక ఉద్యమ వీరుడు, రాజకీయ దురంధరుడు స్వర్గీయ వంగవీటి మోహనరంగా జయంతి సందర్భంగా 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ రంగా కేవలం ఒక సామాజికవర్గానికి చెందిన నేత మాత్రమే కాదని, బడుగు బలహీన వర్గాల వెన్నంటి ఉండి వారికి అండగా నిలిచారని తెలిపారు.

పేదల సమస్యల పరిష్కారం కోసం పోరాడిన గొప్ప వ్యక్తిని కొనియాడారు. చిరంజీవిగా ఎప్పుడూ ప్రజల గుండెల్లో చిరకాలం జీవిస్తూనే ఉంటారని అన్నారు. ఈ కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్,భాస్కర్, రాంబాబు, సాంబశివ రావు, సత్యనారాయణ, కృష్ణారావు, ప్రసాద్, దొరబాబు, ఏసు, వంగవీటి రంగా అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Dodla Venkatesh Goud paid

You cannot copy content of this page

Scroll to Top