Trinethram News : ఈరోజు కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద బాచుపల్లి 2 బి.హెచ్.కే – 7వ బ్లాక్ నూతన కార్యవర్గ కమిటీ సభ్యులు బిఆర్ఎస్ పార్టీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ సభ్యులను ఎమ్మెల్యే అభినందించారు. అనంతరం వారు మాట్లాడుతూ…. రాజీవ్ గృహకల్ప లోని లబ్ధిదారుల సమస్యలు, బాగోగులను తెలుసుకుంటూ ఐకమత్యంతో రాజీవ్ గృహకల్పను అభివృద్ధి చేసుకునే విధంగా నూతన కార్యవర్గ సభ్యులు కృషి చేయాలన్నారు. రాజీవ్ గృహకల్పలో సమస్యల పరిష్కారానికి నూతన కార్యవర్గ సభ్యులకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుందన్నారు.
ఈ కార్యక్రమంలో నూతన అధ్యక్షులు దుర్గాప్రసాద్, ముఖ్య సలహాదారులు మద్దెల సత్యనారాయణ, సలహాదారులు భాస్కరాచారి, ప్రధాన కార్యదర్శి సత్యవతి, కోశాధికారి మోహన్, వర్కింగ్ ప్రెసిడెంట్ రజిత, సంయుక్త కార్యదర్శి రామారావు, ఉపాధ్యక్షులు సజ్జు, కార్యనిర్వా కార్యదర్శి సైదులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


