తేదీ : 03/07/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, బుట్టాయిగూడెం మండలం పరిధిలో ఉన్నటువంటి వీరన్నపాలెం, ఇప్పలపాడు, బోసరాజు పల్లి, కంసాలి కుంట, గురుగుమిల్లి, దొర మామిడి, రంగాపురం, పెద జీడిగుంట, తదితర గ్రామాలలో మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు కె. అన్నపూర్ణ, కె. వీరభద్రుడు, జె. మాధవరెడ్డి, జి. వెంకటలక్ష్మి, టి. జానకి, బి. ధను, పి. రవి యం. కళ్యాణి, పి. శ్రీనివాస్,టి. పుల్లయ్య, యస్. దేవిక మాట్లాడుతూ ఆయా పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో తెలపడం జరిగింది. అదేవిధంగా కొత్తగా ఎంతమంది విద్యార్థులు జాయినింగ్ అయ్యారో చెప్పారు.
ప్రభుత్వ సమయం ప్రకారం పాఠశాలలు పనిచేస్తున్నాయని పేర్కొన్నారు. క్రమశిక్షణతో కూడిన విద్య, మరియు క్రీడలు నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. శ్రీ డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజనం పథకం కింద విద్యార్థులకు పౌష్టిక ఆహారాన్ని , అందిస్తున్నామని తెలిపారు. రాగి జావా, చిక్కీలు, కూరగాయలు, ఆకుకూరలు, గుడ్లు మొదలైనవి ప్రభుత్వ పట్టిక ప్రకారం అందజేస్తున్నమని వివరించారు. ఇందులో భాగంగానే విద్యార్థులకు నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్, మొదలైన మెటీరియల్స్ బ్యాగ్స్ అందించమని తెలిపారు. విద్యార్థులు తల్లిదండ్రులు, విద్యార్థులు అందరు కూడా కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని చెప్పడం జరిగింది. తల్లికి వందనం డబ్బులు హాజరు శాతం న్ని బట్టి సంబంధిత విద్యార్థులకు అందరికీ పడ్డాయని అభినందనలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


