రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జంగాలపల్లి ప్రాంతంలో నిర్మితమైన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల సముదాయానికి దాదాపు రూ. 10 కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ డ్రైనేజీ మరియు మంచినీటి సరఫరా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ విచ్చేసి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వర్తించారు. ఆయనతో పాటు జిల్లా అదనపు కలెక్టర్ మరియు మున్సిపల్ ఇంచార్జ్ అరుణశ్రీ హాజరై ఈ అభివృద్ధి పనులకు బాటవేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సౌకర్యం కోసం నిరంతరాయంగా శ్రమిస్తోందని, ముఖ్యంగా డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారుల జీవన నాణ్యతను మెరుగుపర్చే దిశగా ఈ వసతులు చాలా కీలకమని పేర్కొన్నారు.
అభివృద్ధి పనులకు ప్రభుత్వం విడదల చేసిన రూ. 10 కోట్ల నిధులు ప్రజల అవసరాలను తీర్చడంలో మేలైన మార్గదర్శకంగా నిలుస్తాయని అన్నారు ఈ అభివృద్ధి పనులు పూర్తి కాకముందే అనేక కష్టాలు ఎదుర్కొంటున్న ప్రజలకు త్వరలోనే శుభవార్త లభిస్తుందని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. రామగుండం నగరాన్ని శుభ్రంగా, సుందరంగా తీర్చిదిద్దే లక్ష్యంతో తీసుకుంటున్న ఈ ప్రాజెక్టులు భవిష్యత్తులో మరిన్ని ప్రగతిపథాల్ని తెరువుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు అడిషనల్ కలెక్టర్ అరుణశ్రీ మాట్లాడుతూ, నగరపాలక సంస్థ నిర్దేశించిన విధంగా ప్రాజెక్టుల పనులు నాణ్యతతో పాటు వేగంగా పూర్తిచేయడం మున్సిపల్ అధికారుల ధర్మమని అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణలో శుద్ధమైన మంచినీటి సరఫరా మరియు సమగ్ర డ్రైనేజీ వ్యవస్థ ప్రధాన పాత్ర పోషిస్తాయని వివరించారు ఈ కార్యక్రమంలో మేయర్, మున్సిపల్ కమిషనర్, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులు, మరియు గణనీయమైన సంఖ్యలో స్థానిక ప్రజలు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సమయంలో భాగంగా అభివృద్ధి పనుల రూపరేఖలు ప్రజలకు వివరించడమేగాక, ప్రజల అభిప్రాయాలను సేకరించడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


