Salary Hike : భారీగా జీతాలు పెంపు

TRINETHRAM NEWS

తేదీ : 02/07/2025. గుంటూరు జిల్లా : అమరావతి: (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఒక వేయి ఆరు వందలు యాభై తొమ్మిది మంది ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులకు భారీగా జీతాలు పెంచుతూ కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జూనియర్ లెక్చరర్లు, పిడి (సి) , లైబ్రేరియన్ లా వేతనానికి అదనంగా రూపాయలు పద్ధెనిమిది వేలు నుంచి రూపాయలు ఇరవై నాలుగు వేల నూట యాభై కి పెంచడం జరిగింది. పిజిటిల వేతనానికి అదనంగా రూపాయలు పదహారు వేల వంద నుంచి రూపాయలు ఇరవై నాలుగు వేల నూట యాభై కి పెంచింది.

టి జి టి పిడి(ఎస్) వేతనానికి అదనంగా రూపాయలు పద్నాలుగు వేల ఎనిమిది వందల నుంచి రూపాయలు పందొమ్మిది వేల మూడు వందల యాభై కి పెంచింది. పీఈటి, ఆర్ట్, క్రాఫ్ట్ మ్యూజిక్ సిబ్బందికి రూపాయలు పదహారు వేల ,మూడు వందల వరకు అదనంగా వేతనం పెంచడం జరిగింది. దీంతో కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Huge salary hike

You cannot copy content of this page

Scroll to Top