జూన్ 26, 2026

WhatsApp Image 2024 01 18 at 9.28.02 AM

TRINETHRAM NEWS

చిత్తూరు: కాలేజీ బస్సు బోల్తా

జిల్లాలోని గంగాధర నెల్లూరు మండలం మోతరంగాని పల్లి పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది.

వివేకానంద జూనియర్ కాలేజీ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.

సుమారు పదిమంది విద్యార్థులు గాయపడినట్లు తెలుస్తోంది. వారిని 108 ద్వారా చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

బస్సు డ్రైవరు నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని స్థానికులు అంటున్నారు. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

You cannot copy content of this page