MLA Vegulla : ఎమ్మెల్యే వేగుళ్ళ ను కలిసిన జె.మేడపాడు పిఎసిఎస్ చైర్మన్ ఎస్.పి

TRINETHRAM NEWS

మండపేట: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. జెడ్.మేడపాడు ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘం (పిఎసిఎస్) చైర్మన్ గా నియమితులైన సలాది బాల సుబ్రహ్మణ్యం మంగళవారం మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ని మర్యాదపూర్వకంగా కలిసారు. తనపై నమ్మకంతో పిఎసిఎస్ చైర్మన్ గా నియమించిన ఎమ్మెల్యే వేగుళ్ళ కు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఆయన ద్వారపూడి కూటమి నాయకులు, కార్యకర్తలతో కలసి ఎమ్మెల్యే వేగుళ్ళ ను దుశ్శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేశారు. మెంబర్లు గా సంగిశెట్టి అమ్మన్న, బి.మధన మోహన రమణారావు లు నియమితులయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

J. Medapadu PACS Chairman S.P.

You cannot copy content of this page

Scroll to Top