Papireddy’s Retirement : డిండి మండల కేంద్రంలో ఘనంగా పాపిరెడ్డి పదవీ విరమణ మహోత్సవం

TRINETHRAM NEWS

డిండి (గుండ్ల పల్లి), జూన్ 30. డిండి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గెజిటెడ్ హెడ్మాస్టర్ గా పనిచేస్తున్న పాపిరెడ్డి పదవీ విరమణ మహోత్సవం సోమవారం పాఠశాల ప్రాంగణంలో ఘనంగా నిర్వహించారు. ఇంచార్జ్ హెచ్ఎం తిరుపతయ్య అధ్యక్షత వహించగా, ముఖ్య అతిథిగా పాల్గొన్న మండల విద్యాధికారి గోపియా నాయక్ మాట్లాడుతూ ప్రతి ఉద్యోగికి పదవీ విరమణ సహజమని, విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా సేవలందించిన వారు చిరకాలం గుర్తుండిపోతారని అన్నారు. గత 36 సంవత్సరాల నుండి పవిత్ర ఉపాధ్యాయ వృత్తిలో వివిధ పాఠశాలల్లో పని చేస్తూ, జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత పాపిరెడ్డి సేవలు అనధికాలంలోనే ప్రశంసలందుతున్నాయి. మండల స్థాయి విద్యావ్యవస్థలో మాకందరికి తలమానికగా పనిచేసే మార్గదర్శిగా వ్యవహరించారని ఈ సందర్భంగా ఎంఈఓ గుర్తు చేశారు. ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ గోపాల్ రెడ్డి మాట్లాడుతూ పాపిరెడ్డి సేవ లు ఆదర్శనీయమని పాఠశాల అభివృద్ధికి తీవ్ర కృషి సలిపారని గుర్తు చేశారు. పాఠశాల పక్షాన పాపిరెడ్డికి సన్మాన పత్రం సమర్పించే ఘనంగా సన్మానించారు. ఇన్చార్జి హెడ్మాస్టర్ తిరుపతయ్య మాట్లాడుతూ పాపిరెడ్డి నాయకత్వంలో మేము టీం స్పిరిట్ తో పనిచే సి ఉత్తమ ఫలితాలు సాధించామని తెలిపారు.
పాఠశాల మౌలిక సదుపాయాల కల్పనలో పాపిరెడ్డి పాత్ర ప్రశంసనీయమని పలువురు వక్తలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, రిటైర్డ్ టీచర్లు, పాపిరెడ్డి బంధుమిత్రులు, అధిక సంఖ్యలో పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, నరసింహ, కర్ణ రెడ్డి , గోవర్ధన్, ముత్యాల శేఖర్ రెడ్డి, బ్రహ్మచారి, వి శేఖర్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, గొడుగు శ్రీనివాస్, పవన్, పెంటావతి, పురుషోత్తం రెడ్డి ,శివప్రసాద్ రెడ్డి ,శంకరయ్య దుబ్బ రాకేష్ రెడ్డి, బచ్చిరెడ్డి, బీరం శ్రీనివాస్ రెడ్డి, బంధుమిత్రులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. పాపిరెడ్డి రజిత దంపతులను ఘనంగా సన్మానించారు. విద్యార్థిని విద్యార్థులచే నిర్వహించబడిన సాంస్కృతి కార్యక్రమాలు చూపరులను ఆకట్టుకున్నాయి. సన్మాన గ్రహీత పాపిరెడ్డి మాట్లాడుతూ నా ఆహ్వానాన్ని మన్నించి పదవీ విరమణ సభకు హాజరై నాకు శుభాకాంక్షలు తెలిపి, సన్మానించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Papireddy's retirement celebration was

You cannot copy content of this page

Scroll to Top