Bhaskar Rao : ఘనంగా నిర్వహించిన భాస్కర్ రావు 34 వర్థంతి

TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. సోమవారం ఆర్జీ వన్ జి.ఎం ఆఫీస్ చౌరస్తా వద్ద ఉన్న భాస్కర్ రావు విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏఐటియుసి నాయకులు గోదావరిఖని లో భాస్కర్ రావు కార్మిక వర్గానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం భాస్కర్ రావు భవన్ లో స్మారక సభ నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటియుసి) ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లా గౌడ్, కేంద్ర కార్యదర్శి కవ్వంపల్లి స్వామి, ఆర్జీ వన్ బ్రాంచి కార్యదర్శి ఆరెల్లి పోషం లు ప్రసంగించగా,

వేదిక పై బ్రాంచి ఉపాధ్యక్షులు సంకె అశోక్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్, సిపిఐ నగర కార్యదర్శి కనకరాజు, ఏఐటియుసి ఆర్జీ వన్ బ్రాంచి సహాయ కార్యదర్శి రంగు శ్రీను, ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎ. గౌస్, భాస్కర్ రావు కుమారులు శేషు కుమార్, శ్రీదర్ లు ఆసీనులు కాగా, సిపిఐ, ఏఐటియుసి నాయకులు బోగ సతీష్ బాబు, గండి ప్రసాద్, ఎస్ వెంకట్ రెడ్డి, ఆకునూరి శంకరయ్య, చెప్యాల భాస్కర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూరి వెంకన్న, గుర్రం ప్రభుదాస్, నాయిని శంకర్, బలుసు రవి, బండి మల్లేష్, రెడ్డి వెంకట స్వామి, విగ్రహా దాత పగడాల ప్రతాప రెడ్డి, ఏఐటియుసి ఆర్జీ వన్ సోషల్ మీడియా ఇంచార్జీ చంద తిరుపతి, ఆఫీస్ కార్యదర్శి తొడుపునూరి రమేశ్ కుమార్ తో పాటు తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bhaskar Rao's 34th death

You cannot copy content of this page

Scroll to Top