కేతావత్ బాబురామ్ నాయక్
గిరిజన సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్
విద్యార్థుల రాజకీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు .
దేవరకొండ జూన్ 29 త్రినేత్రం న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో అనేక ప్రైవేట్ పాఠశాలలు విద్యను వ్యాపారంగా మార్చి, కేంద్ర ప్రభుత్వం రూపొందించిన విద్యా హక్కు చట్టం (RTE-2009)కు విరుద్ధంగా వ్యవహరిస్తున్నాయి. ఈ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు ఏమాత్రం పాటించకుండా, విద్యార్థులపై మానసిక ఒత్తిడిని కలిగించే విధంగా స్వచ్ఛందంగా సిలబస్ తయారు చేసుకుంటూ, విద్యను వ్యాపార వేదికగా మలుస్తున్నాయి.
ప్రస్తుతం అనేక పాఠశాలలు –
సొంత పబ్లికేషన్ పుస్తకాలను బలవంతంగా అమ్ముతూ, వేల రూపాయలు వసూలు చేస్తున్నాయి
ప్రభుత్వ పాఠ్యపుస్తకాలను ఖాతరచడం లేదు
కనీస విద్యార్హతలు లేని టీచర్లతో బోధన నిర్వహిస్తున్నారు
శౌచాలయాలు, మౌలిక వసతులు లేకుండా పిల్లల భద్రతను పట్టించుకోవడంలేదు
ప్రభుత్వ అనుమతి లేకుండానే తరగతులు నడుపుతున్నారు
ఇది పూర్తిగా విద్యా హక్కు చట్టానికి, విద్యార్థుల హక్కులకు వ్యతిరేకం.
ఈ అంశంపై జాతీయ బాలల హక్కుల సంరక్షణ సంఘం (NCPCR) కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఏప్రిల్ 15న దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు లేఖలు రాసి, అన్ని పాఠశాలలు తప్పనిసరిగా NCERT/SCERT రూపొందించిన పాఠ్యపుస్తకాలను మాత్రమే పాటించాలని స్పష్టం చేసింది. ఎవరైనా తమ సొంత కోర్సులు అమలు చేస్తే, వారికి జువెనైల్ జస్టిస్ చట్టం కింద చర్యలు తీసుకోవాలని సూచించింది.ఈ సందర్భంగా కేతావత్ బాబురామ్ నాయక్ స్పష్టం చేశారు: విద్య అనేది వ్యాపార దండగ కాదు. కార్పొరేట్ పాఠశాలలు పిల్లల భవిష్యత్తును లాభదండగగా మలుస్తూ, చట్టాలను ఉల్లంఘిస్తున్నాయి. ఇది అప్రజాస్వామికం. విద్యా శాఖ తక్షణ స్పందన ఇవ్వాలి.” అదే విదంగా మా యొక్క ముఖ్య డిమాండ్లు
- DEO మరియు RJD లాంటి సంబంధిత అధికారులపై సమగ్ర విచారణ జరపాలి
- NCERT/SCERT పాఠ్యపథకాలను తప్పనిసరిగా అమలు చేయించాలని జిల్లా స్థాయి ఉత్తర్వులు ఇవ్వాలి
- విద్యా శాఖ అన్ని జిల్లాలకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయాలి
- విద్యా హక్కు చట్టాన్ని ఉల్లంఘించిన పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి
- విద్యార్థుల హక్కులను ప్రాథమికంగా పరిరక్షించేందుకు ప్రత్యేక తనిఖీ బృందాలు నియమించాలి
ఈ సమస్యపై చర్యలు తీసుకోకపోతే, విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా చైతన్యం తీసుకురావడమే మా లక్ష్యం అని వారు అన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


