సమ్మోహన దృశ్యం – ఏకంగా గంట పాటు శివలింగాన్ని చుట్టుకుని దర్శనమిచ్చిన నాగుపాము

TRINETHRAM NEWS

Trinethram News : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని పుష్కర ఘాట్ సమీపంలోని శివాలయంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయంలోని శివలింగానికి చుట్టుకుంటూ నాగుపాము దర్శనమిచ్చింది. ఈ ఘటనతో భక్తులు తన్మయత్వానికి లోనయ్యారు. శివలింగానికి చుట్టుకున్న నాగుపామును చూసిన భక్తులు శంభో శంకర, హర హర మహాదేవ అంటూ శివస్తుతి చేశారు. ఆలయ పూజారులు శంఖాలను ఊదుతూ. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ దృశ్యాన్ని శివుని ప్రత్యక్ష రూపంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Mesmerizing scene – A cobra

You cannot copy content of this page

Scroll to Top