తేదీ : 25/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో కృష్ణ యూనివర్సిటీ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చిన రాష్ట్ర గవర్నర్ నజీద్ కు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఘనంగా స్వాగతం పలికారు. యూనివర్సిటీ వద్ద ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా ఏపీఎస్ఆర్టీసీ, చైర్మన్ కొనకల. నారాయణరావు, అధికార ప్రముఖులతో కలిసి అభివాదాలు చేస్తూ స్వాగతం పలకడం జరిగింది. ఘనంగా జరుగుతున్న యూనివర్సిటీ వేడుకల్లో పాల్గొనడం సంతోషకరమైన విషయం అని గుడివాడ ఎమ్మెల్యే రాము తెలిపారు. మంత్రులు, నారా లోకేష్, ఇంచార్జ్ మంత్రి వాసంశెట్టి .సుభాష్, కొల్లు. రవీంద్ర, సమాచార ఎమ్మెల్యేలు, అధికారం ప్రముఖులతో కలిసి వేడుకలకు ఎమ్మెల్యే హాజరవడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


