ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్.. చివరి నిమిషంలో అద్దంకి దయాకర్‌కు షాక్

TRINETHRAM NEWS

Trinethram News : హైదరాబాద్..

కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఎవరన్న ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులను కాంగ్రెస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది..

ఎమ్మెల్యే కోటాలో ఖాళీగా ఉన్న రెండు ఎమ్మెల్సీ స్థానాలకు బల్మూరి వెంకట్, మహేష్ కుమార్ గౌడ్ పేర్లను కాంగ్రెస్ హై కమాండ్ ఎంపిక చేసింది. ఈ మేరకు బుధవారం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఒక ప్రకటన విడుదల చేశారు. అయితే, మొదట ఈ రెండు స్థానాలకు అద్దంకి దయాకర్, బల్మూరి వెంకట్‌లను ఎంపిక చేసినట్లు మంగళవారం మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి. నామినేషన్ వేసేందుకు సిద్ధం కావాలని ఇరువురికి పార్టీ హై కమాండ్ సూచించినట్లు జోరుగా ప్రచారం జరిగింది. తాజాగా ఇవాళ ప్రకటించిన అభ్యర్థుల లిస్ట్‌లో అనూహ్యంగా అద్దంకి దయాకర్‌కు చోటు దక్కకపోవడం పొలిటికల్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దయాకర్ స్థానంలో మహేష్ కుమార్ గౌడ్‌కు కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించడంతో అద్దంకికి మరో పోస్ట్ ఏదైనా ఇస్తారా అని చర్చ జరుగుతోంది..

You cannot copy content of this page

Scroll to Top