Trinethram News : వాషింగ్టన్ : ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ముగిసిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించాడు. ఇరు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందానికి వచ్చాయని చెప్పాడు. ఈ ఒప్పందం మరో 24 గంటల్లో అమల్లోకి వస్తుందని తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్’లో పోస్టు చేశాడు. 12 రోజుల యుద్ధానికి ఇది ముగింపని, యుద్ధం విరమణకు అంగీకరించిన రెండు దేశాలకు అభినందనలు అంటూ పేర్కొన్నాడు. మరో ఆరు గంటల్లో చర్యలు ప్రారంభం కానున్నాయని, 12 గంటల్లో యుద్ధం అధికారికంగా ముగియనుందంటూ ప్రకటించాడు. అయితే ట్రంప్ ప్రకటనను ఇరాన్ ఖండించింది. కాల్పుల విరమణకు ఎలాంటి ఒప్పందం కుదరలేదని స్పష్టం చేసింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


