Paddy Cultivation Method : మెట్ట సాగు పద్ధతిలో వరి

TRINETHRAM NEWS

డిండి(గుండ్లపల్లి ) జూన్ 22త్రినేత్రంన్యూస్. డిండి మండలంపరిధిలోని ఖానాపూర్ గ్రామంలో మేరుగు నరసింహారెడ్డి అనే రైతు మెట్ట సాగు పద్ధతిలో వరి సాగుచేయడం జరుగుతుంది.వ్రీధి ఇంపాక్ట్ సర్వీసెస్ మండల ఫీల్డ్ ఆఫీసర్ సత్యనారాయణ ఈ మెట్ట వరి సాగుపై క్లుప్తంగా వివరించడం జరిగింది. మనకు వరి పంట పండించడం కొత్త ఏమి కాదు కానీ పండించే పద్ధతులు మాత్రం మారుతున్నాయి, నాటు వేసే పద్ధతిని మనము ఎప్పటినుంచో చేస్తున్నాము. కానీ ఈ మధ్యకాలంలో మనకు కూలీల ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతేకాకుండా కూలీల కొరత ఏర్పడుతుంది .ఇందుకోసం మనం ఇతర గ్రామాల నుండి కూలీలను తెప్పించుకోవలసిన పరిస్థితి వస్తుంది దీనివల్ల ఖర్చులు పెరిగిపోతున్నాయి అయినను సమయానికి నాట్లు వేసే పరిస్థితి లేదు రైతు నాటు అయ్యేంతవరకు చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు. ఈ సమస్య నుండి రైతులను బయటపడేయడానికి మన శాస్త్రవేత్తలు ఒక పరిష్కారాన్ని కనిపెట్టారు అదే మెట్ట పద్ధతిలో వరి పంట సాగు చేయడం ఈ పద్ధతులో చాలా లాభాలు ఉన్నాయి. ఈ పద్ధతి వానకాలం పంటకు అనుకూలం. ఈ పద్ధతిలో రైతులకు అనేక లాభాలు ఉన్నాయి.

ఈ పద్ధతిలో పొలాన్ని బురద చేసి గొర్రు కొట్టనవసరం లేదు కేవలం 3 నుండి 4 సార్లు దుక్కి దున్నితే సరిపోతుంది .నారుమడిలో నారును పెంచనవసరం లేదు. నాటు వేయడానికి కూలీలు అవసరం లేదు. కేవలం ఒక గంటలోపే ఒక ఎకరం విత్తడం అయిపోతుంది. ఎకరానికి సన్న రకాలు అయితే 8 నుంచి 10 కిలోలు, దొడ్డు రకాలు అయితే 10 నుంచి 12 కిలోల విత్తనం సరిపోతుంది.నీరు కూడా ఎక్కువ అవసరం లేదు. 20 రోజుల వరకు అవసరాన్ని బట్టి నీరు పెట్టుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత మామూలుగా నీరు పెట్టుకోవాలి. వరుసగా పద్ధతిలో ఉంటుంది కాబట్టి గాలి వెలుతురు బాగా తగులుతుంది. కాబట్టి చెడ పీడల బెడద ఎక్కువగా ఉండదు. ఒక ఎకరానికి సుమారుగా 8000 వరకు పెట్టుబడి ఖర్చులు మిగులుతాయి. దిగుబడి కూడా సాధారణ పద్ధతిలో మాదిరిగానే వస్తుంది. ఈ సాగులో కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అవి ఏంటంటే ఇందులో కలుపు సమస్య వస్తుంది కానీ వీటి కోసం కలుపు మందులు అందుబాటులో ఉన్నాయి

  1. విత్తనాలు వేసిన 48 గంటల లోపు ‘పెండిమెథాలిన్’ అనే కలుపు మందును పిచికారి చేసుకోవాలి. ఈ మందుతో కలుపు 90% వరకు నివారించబడుతుంది.
  2. విత్తనాలు వేసిన 20 నుండి 25 రోజుల వయస్సులో లేదా కలుపు 2 నుంచి 3 ఆకుల దశలో రెండవసారి ‘నామిని గోల్డ్+ ఫైరోజో సల్ఫ్యూరాన్ ఇథైల్ లేదా నామిని గోల్డ్+ అస్సర్ట్ కలుపు మందులను పిచికారి చేయడం వల్ల కలుపు పూర్తిగా నివరించబడుతుంది అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ట్రాక్టర్ ఓనర్ కం డ్రైవర్ రామకృష్ణ, రైతులు తదితరులు పాల్గొన్నారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Paddy cultivation method

You cannot copy content of this page

Scroll to Top