Gaddam Prasad Kumar : ముఖ్యమంత్రి సహాయనిధి నిరుపేదలకు వరం

TRINETHRAM NEWS

త్రినేత్రం వికారాబాద్ నియోజకవర్గ ప్రతినిధి : ఈరోజు వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో వికారాబాద్ మున్సిపల్ కు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF ) చెక్కులను వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు, మాజీ మున్సిపల్ ఫ్లోర్ అర్ధ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ శాసనసభాపతి, వికారాబాద్ శాసనసభ్యులు గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరై లబ్ధిదారులకు చెక్కులు అందజేసినారు.

ఈ సందర్భంగా నిరుపేద కుటుంబాలకు కొంతలో కొంత ఉరటగా ఆస్పత్రిలో చికిత్సకు అయిన ఖర్చుల నిమిత్తం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి వికారాబాద్ నియోజకవర్గం లో పెద్దఎత్తున చెక్కులు పంపిణీ చేయడం జరుగుతుందని పేద ప్రజలకు సహాయం చేయడం చాలా సంతోషంగా ఉందని తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం. ప్రసాద్ కుమార్ తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు అర్ధ.సుధాకర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chief Minister's Relief Fund

You cannot copy content of this page

Scroll to Top