తేదీ : 21/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పోలవరం నియోజకవర్గం, కుక్కునూరు మండలం , పెదరావి గూడెం గ్రామపంచాయతీలో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా యం. రామాచారి, అంగన్వాడి , సచివాలయ సిబ్బంది మరియు గ్రామ పెద్దలు , సర్పంచ్ ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. బిజెపి పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు, కాబోయే కుక్కునూరు మండలం బిజెపి అధ్యక్షులు కుంజా. వెంకట నరసయ్య దొర మాట్లాడుతూ యోగా చేయడం వల్ల మానసికంగా ఆరోగ్యం బాగుపడుతుంది అని, ఆరోగ్యమే మహాభాగ్యం అని, తెలిపారు. నేను ప్రజలకు ఎవరికైనా సమస్య వచ్చిందని నాకు తెలిస్తే వెంటనే స్పందించి ఆ సమస్యకు పరిష్కారం నేను చేసేది అయితే వెంటనే చేస్తాను, చేస్తున్నాను, ఆ సమస్యకు పరిష్కారం ఎవరు చేస్తే అవుతుందో వాళ్లతో చేపిస్తున్నాను అని తెలిపారు.
ప్రజా సేవ చేయడమే నా లక్ష్యమని పేర్కొన్నారు. ఉమ్మడి కూటమి గెలిచిన తరువాత రాష్ట్రంలో ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సూపర్ సిక్స్ పథకాలు అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి అందుతున్నాయని అనడం జరిగింది. రాష్ట్రం మరియు, జిల్లా, నియోజవర్గం, మండలం, గ్రామాలలో కూడా కూటమి నాయకులు ఐక్యంగా ఉండి ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాల గురించి, అదేవిధంగా అందిస్తున్న పథకాల గురించి ప్రజలకు తెలిసే విధంగా ప్రచారం చేయాలని నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు సూచించారు. ప్రధానమంత్రి మోదీ భారతదేశాన్ని ఉదయించే సూర్యుడు వలె పాలిస్తున్నాడని అన్నారు. అదేవిధంగా గత ప్రభుత్వం రాష్ట్రాన్ని చీకటిమయం చేస్తే కూటమి ప్రభుత్వం గెలిసిన తర్వాత చీకటిని చీల్చుకుని తెలుగు వచ్చే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, దేశంలో ప్రధాని మోదీ, ఈ ముగ్గురు దేశం మరియు రాష్ట్రాన్ని కాపాడుకుంటూ వస్తున్నారని పేర్కొన్నారు. కుక్కునూరు బడా రాజకీయ నాయకులు, మండలంలో పేకాట రాయుళ్లు జోరు కొనసాగుతుందని , సంబంధిత అధికారులకు తెలిసిన పట్టించుకోవడంలేదని మండిపడ్డారు. అదే పేదలు పేకాట ఆడితే వెంటనే సంబంధిత అధికారులకు ఫిర్యాదు ఇచ్చి జైల్లో పెడతారు ఇది న్యాయమేనా? అని అన్నారు. ధనవంతులకు ఒక న్యాయం, పేద వాళ్లకు ఒక న్యాయమా? అన్నారు. కూటమి ప్రభుత్వం ఉన్నంతకాలం ప్రజలకు చీకటి అనేది రాదు అని బల్లగుద్ది చెప్పారు. వైసిపి చేసే చెడు ప్రచారాలను ప్రజలు నమ్మరని అన్నారు.
డైనమిక్ ఎమ్మెల్యే చిర్రి. బాలరాజు పోలవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని ప్రజలు హర్ష వ్యక్తం చేస్తున్నారని చెప్పడం జరిగింది. రాష్ట్రంలో కూడా సంబంధిత నియోజవర్గాల ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రులు అందరు కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలోనే పరుగులు పెట్టిస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, అన్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు చేసినా ఎప్పుడు ఎన్నికలు జరిగిన మళ్లీ మళ్లీ ఉమ్మడి కూటమి ప్రభుత్వమే వందకు వందశాతం గెలుస్తుందని అనడం జరిగింది. ఇప్పుడైతే పదకొండు సీట్లు ఉన్న వైసిపి మళ్లీ ఎలక్షన్లకు ఒకటి మాయమైపోయి ఒకటే మిగులుతుంది ఆ ఒక్కటి ఎవరు ఎమ్మెల్యే అవుతారు తెలియని పరిస్థితి కూడా ఏర్పడుతుందని పేర్కొన్నారు. పదకొండు వ అంతర్జాతీయ దినోత్సవం శుభాకాంక్షలు ను అందరకు తెలియజేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


