Private Schools : బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి

TRINETHRAM NEWS

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు,టై బెల్ట్ అమ్మకాలు

ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి
బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ .
దేవరకొండ జూన్ 20 త్రినేత్రం న్యూస్.. దేవరకొండ నియోజకవర్గంలో బుక్ స్టాల్స్ నిర్వహిస్తున్న ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని బిఆర్ఎస్వీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు బొడ్డుపల్లి కృష్ణ అధికారులను డిమాండ్ చేశారు. శుక్రవారం దేవరకొండ పట్టణంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ……. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేటు పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలు,యూనిఫామ్ లు,టై బెల్ట్ లు అమ్ముతూ పేద విద్యార్థులను దోచుకుంటున్నారని ఆరోపించారు.అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలలో ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని ఆయన కోరారు.ప్రభుత్వ నిబంధనలను పాటించని ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలి అని ఆయన కోరారు. ఈ సమావేశంలో బిఆర్ఎస్వీ మండల అధ్యక్షులు పాత్లవత్ లక్ష్మణ్, పొట్ట మధు,జామీర్ బాబా,పేట అభి,అంజి, వెంకటేష్ , మహేష్,రవి,తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Action should be taken

You cannot copy content of this page

Scroll to Top