ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాల అమల్లో ఎందుకు.
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూన్,17 : ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ, అనుబంధ సంఘ కాకినాడ కమిటీ అధ్యక్షులు బొబ్బిలి శ్రీనివాసరావుఆధ్వర్యంలో మంగళవారం ఉదయం కాకినాడలో స్థానిక కాకినాడ మున్సిపల్ కార్యాలయం వద్ద పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల అమలు చేయాలని నిరసన ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథిగా ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ పాల్గొన్నారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులకు,కాకినాడ స్పెషల్ సానిటేషన్ ,టాయిలెట్ వర్కర్స్, బ్యాంక్స్,స్కూల్స్, పార్క్స్, కాలేజీలలో, ఎలక్ట్రిసిటీ, ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి, ఆర్టీసీ, తదితర రంగాల ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు తక్షణమే అమలు చేయాలని ప్రసాద్ డిమాండ్ చేశారు.
కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ అయినా చేయండి, ప్రభుత్వ సంక్షేమపథకాలు అయినా అమలు చేయండి, జీతాలైన పెంచండి అని అన్నారు. ఎన్నికల హామీల వాగ్దానాల్లో లేని ఆంక్షలు పథకాల అమల్లో ఎందుకు విధిస్తున్నారని, లబ్ధిదారుల సంఖ్య తగ్గించేందుకు ఇది కుట్రలో భాగమని ఆయన అన్నారు. స్మార్ట్ మీటర్లు బిగింపు కారణంగానే అందరికీ 300 యూనిట్లు విద్యుత్ బిల్లు పెరుగుతుందని, గ్రామీణ ఉపాధి హామీ కూలీలు కి, వ్యవసాయ కూలీలకు, తాపీ కూలీలకు, తదితర రంగాల కార్మికులందరికీ నెలసరి ఆదాయం 12 వేలకు మించి ఉంటుందని దీనిని కుంటి సాకగా చూపించి పథకాలు ఎగ్గొట్టడానికి నెలసరి ఆదాయం వంకలు చూపించడం సరికాదని అని అన్నారు. ఎన్నికల హామీలో భాగంగా కుటుంబంలో ఉన్న తల్లుల చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందన పథకం అమలు చేయాలని ఆంక్షలు ఎత్తివేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో బొబ్బిలి సత్యనారాయణ, బంగారు రాజేష్, బొబ్బిలి ఈశ్వరరావు, నిమ్మకాయ ఈశ్వరరావు, కటారి సత్యనారాయణ, మణికంఠ, నక్క లక్ష్మణ్, సత్యనారాయణ, నక్క అప్పన్న తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


