పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రారంభోత్సవాలు, శంఖు స్థాపనలు
భారీగా హాజరైన కూటమి శ్రేణులు
ఎమ్మెల్యే వేగుళ్ళ కు ఘన సన్మానం
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట మండలం ఏడిద లో కూటమి నాయకులు పలు అభివృద్ధి కార్యక్రమాలతో సందడి చేశారు. తొలుత కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు కు గ్రామ కూటమి నాయకులు పెద్ద ఎత్తున బాణాసంచా కాల్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం దివంగత నేతలు ఎన్టీఆర్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్, డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్, వంగవీటి మోహనరంగా ల విగ్రహాలకు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే వేగుళ్ళ ప్రారంభోత్సవాలు, శంఖు స్థాపనలు చేశారు.పంచాయతీ 15వ ఆర్థిక సంఘం నిధులు 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్ లను ప్రారంభించారు. ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులు 30 లక్షలతో నిర్మించిన 12 సీసీ రోడ్లను ప్రారంభించారు. 16 లక్షలతో నిర్మించిన 7 గోకులం షెడ్లను ప్రారంభించారు.
అలాగే 30 లక్షల రూపాయల పంచాయతీ నిధులతో నిర్మించనున్న సీసీ రోడ్లు, డ్రైన్ ల నిర్మాణ పనులకు శంఖు స్థాపనలు చేశారు. వీటితో పాటు 9;లక్షల రూపాయలతో చేపట్టనున్న ఇరిగేషన్ డ్రైన్ మెయింటైనెన్స్ పనులకు శంఖు స్థాపన చేశారు. అనంతరం నిర్వహించిన సభ కు గ్రామస్థులు, కూటమి నేతలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ ను ప్రజలు నాయకులు ఘనంగా సన్మానించి సత్కరించారు. అనంతరం ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ గడిచిన ఐదేళ్లు నియోజకవర్గం లో కుంటు పడిన అభివృద్ధి పనులు ఇప్పుడు గాడిలో పడుతున్నారన్నారు. ఇది ప్రజల కోసం పని చేసే ప్రజా ప్రభుత్వమని పేర్కొన్నారు. ప్రజా అవసరాలను గుర్తించి గ్రామాభివృద్ధి కి పాటు పడటం జరుగుతుందన్నారు.
తల్లికివందనం పథకం అమలు ద్వారా రాష్ట్ర ప్రజలంతా ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారన్నారు. గత ప్రభుత్వం ప్రతి బిడ్డకు అమ్మ ఒడి ఇస్తామని చెప్పి ఆ తరువాత మాట తప్పి దానిని ప్రతి తల్లికి పథకం కింద మార్పు చేసిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాటకు కట్టుబడి ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కి తల్లికి వందనం అమలు చేసి మాట నిలబెట్టుకుందన్నారు.ఈ రోజు రాష్ట్రం లోని ప్రతి తల్లి కళ్ళల్లో ఆనందం కనిపిస్తోందన్నారు. ఒకవైపు అభివృద్ధి మరో వైపు సంక్షేమం రెండింటికి సమ ప్రాధాన్యతను ఇస్తూ ప్రజారంజక పాలన అందిస్తున్న ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


