చదువుకునే పిల్లలందరికీ తల్లికి వందనం పథకం ఎగ్గొట్టడానికి ఈ ఆంక్షల కుట్ర
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాకినాడ,జూన్,14: ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాల్లో భాగంగా సూపర్ సిక్స్ పథకాల్లో ఒకటైన తల్లికి వందనం పథకం చదువుకున్న పిల్లలందరికీ అమలు చేయలేకే ఆంక్షలు కుట్ర అని శనివారం ఉదయం సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్ పత్రిక ప్రకటన విడుదల చేశారు. ప్రసాద్ ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంతన ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా తల్లికి వందనం పథకాన్ని జూన్ 12వ తేదీన మంజూరు చేసిందని, ఈ పథకం చదువుకునే పిల్లలందరికీ పూర్తిస్థాయిలో అమలు చేయలేకే ఆంక్షలు కుట్రలు విధిస్తుందని ఆయన అన్నారు. ఒక కుటుంబంలో ఎంతమంది ఉన్నా వారందరికీ పథకాలు అమలు చేస్తానని చెబుతూనే మరోపక్క విద్యుత్ యూనిట్ లు 300 దాటిన వారికి పథకాలు లేవని, నెలసరి ఆదాయం 12000 మించరాదని కుంటు సాకులు చెబుతూ పథకాలు నిలుపుదల చేస్తున్నారని, విద్యార్థుల తల్లిలు మహిళలందరూ తల్లికి వందనం పథకం అమలుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారని వారి ఆశలు అడియాసగా మిగిలాయని ఆయన అన్నారు.
గత ప్రభుత్వం విధించిన ఆంక్షలు ఈ ప్రభుత్వం విధిస్తుందని, గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి పాలనలో ఏమాత్రం తేడా లేదని దొందు దొందేనని, కాంట్రాక్ట్ ,ఔట్సోర్సింగ్ కార్మికులకు, కనీసం కూలీలకు కూడా తల్లికి వందన పథకం అమలు కాలేదని ఆయన అన్నారు. 47 వార్డు సచివాలయంలో ఒక్క Bలోనే ప్రభుత్వం సెలెక్ట్ చేసిన లిస్టులో ప్రకారం మొత్తం 391 లో ఉంటే అందులో 226 మంది పిల్లలకు మాత్రమే తల్లికి వందన పథకం మంజూరు అయిందని, మిగతా 165 మందికి విద్యుత్ వినియోగం 300యూనిట్లు దాటిందని, కుటుంబ నెలసరి ఆదాయం 12 వేల రూపాయలు దాటిందని కుంటి సాకులు చూపుతున్నారని, అధిక శాతం మందికి ఇవే కారణాలని, పథకాలు ఒక్క సచివాలయం, బి, లోనే ఇన్ని ఆంక్షలు ఉంటే జిల్లా వ్యాప్తంగా ఎన్ని సచివాలయాల్లో ఎన్ని ఆంక్షలు విధించారో ప్రజలు గమనిస్తున్నారని, పథకాలు ఎగ్గొట్టడానికే ఆంక్షలు విధిస్తున్నారన్నారు.
ఈ పథకాలు పదవ తరగతి పిల్లలకు,ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పిల్లలకు ఏ ఒక్కరికి అమలు చేయలేదని, ఈ పథకాలు కేవలం పత్రిక ప్రచార ఆర్భాటాలకు, తల్లికి వందన పథకం పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగా పథకం అమలు తీరు ఉన్నదని, ప్రజలకి అందరికీ పూర్తిస్థాయిలో పథకాలు అందలేదని తల్లులు అందరూ ఆవేదనలు చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటికైనా చిత్తశుద్ధిగా చదువుకునే పిల్లలందరికీ పూర్తిస్థాయిలో ఆంక్షలు ఎత్తివేసి పథకాల అమలు చేయాలని, లేకుంటే మహిళల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


