త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట: యోగ ధ్యానం వలన మానసిక ప్రశాంతత కలిగి ఆరోగ్యం గా ఉంటారని రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మెన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పేర్కొన్నారు. మండపేట పురపాలక సంఘం ఆధ్వర్యంలో శనివారం మండపేట బాబు అండ్ బాబు కన్వెన్షన్ వద్ద యోగాభ్యాసం ట్రయిల్ రన్ నిర్వహించారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో భాగంగా ఈ యోగా అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ యోగ సాధన చేయాలని కోరారు.
ప్రతీ రోజు ఉదయం యోగ సాధన చేస్తే వ్యాధులు దరి చేరవని చెప్పారు. ఆధునిక కాలంలో ఒత్తిడి పెరిగి పలు అనారోగ్య సమస్యలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదే ఉదయం, సాయంత్రం క్రమం తప్పకుండా యోగ సాధన చేస్తే సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. యోగా తో పాటు సరైన ఆహార అలవాట్లు చేసుకోవాలని కోరారు. సత్యసాయి ధ్యానమండలి విజయవాడ రఘు, తిరుపతి రాజు లు యోగ శిక్షణా ఇచ్చారు. యోగ ఆసనాలు వేయించారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


