విశేషంగా హాజరైన కూటమి శ్రేణులు…
ఏడాది లో అభివృద్ధి, సంక్షేమానికి కూటమి పెద్ద పీట…
రాబోయే రోజుల్లో మరింత జనరంజకంగా సాగనున్న పాలన…
విజయోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయిన సందర్భంగా మండపేట లో కూటమి శ్రేణులు విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. నియోజకవర్గం నలు మూలలు నుండి టీడీపీ, జనసేన, బీజేపీ శ్రేణులు విశేష సంఖ్యలో హాజరై సందడి చేశారు. మండపేట ఎమ్మెల్యే, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ వేగుళ్ళ జోగేశ్వరరావు ఆధ్వర్యంలో కూటమి శ్రేణులు టీడీపీ కార్యాలయం నుండి పెద్ద ఎత్తున ర్యాలీగా బస్టాండ్ వద్ద గల సూర్య కన్వెన్షన్ హాల్ కు చేరుకున్నారు. మార్గం మద్యలో కరాచీ సెంటర్ వద్ద ఎమ్మెల్యే తో పాటు మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్,, మండపేట నియోజకవర్గ బీజేపీ ఇంచార్జి సాయిరామ్, జనసేనపార్టీ పట్టణ అధ్యక్షులు నామాల చంద్రరావు, తదితరులు ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు.
అనంతరం సూర్య కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సభకు మాజీ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి సభాధ్యక్షత వహించారు. సభలో తొలుత పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు నామాల చంద్రరావు మాట్లాడుతూ కూటమి సాగిస్తున్న సుపరిపాలన చూసి వైసీపీ నాయకులకు నిద్రపట్టడం లేదన్నారు.
బీజేపీ నేత చట్రాతి జానకి రాంబాబు మాట్లాడుతూ జగన్ కు ప్రతిపక్ష హోదా కూడా దక్కనీయకుండా దేశం లోనే ఘన విజయం సాధించిన ఘనత కూటమికే దక్కుతుందన్నారు. పట్టణ టీడీపీ మాజీ అధ్యక్షులు ఉంగరాల రాంబాబు మాట్లాడుతూ నరకాసుర వధ తరువాత ప్రజలు దీపావళి చేసుకున్నట్టు జగన్ నిరంకుశ పాలన నుండి ఏడాది క్రితం విముక్తులైన ప్రజలు నేడు వేడుకలు చేసుకోవడం జరుగుతుందన్నారు.
కౌన్సిలర్ కాళ్ళకూరి స్వరాజ్య భవాని మాట్లాడుతూ అన్నా క్యాంటిన్ ల ద్వారా ఎందరో నీరు పేదలకు ఆకలి బాధలు తీర్చిన ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబుకే దక్కుతుందన్నారు. బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కోన సత్యనారాయణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత గ్రామ స్థాయి నుండి జాతీయ రహదారులు వరకు రోడ్లన్నీ బాగుపడ్డాయన్నారు. ఇప్పనపాడు గ్రామ సర్పంచ్ భర్త కుంచె ప్రసాద్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు ఎంతో చేసిందన్నారు. ఉపాధి హామీ కూలీలకు 50 రోజులు పని దినాలను పెంచిన ఘనత కూటమిదన్నారు.
జనసేన పార్టీ నేత సరాకుల అబ్బులు మాట్లాడుతూ మండపేట లో ఎమ్మెల్యే గా గెలవాలన్న ఆశను ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు వదులుకోవాలని, అది ఈ జీవితంలో జరగదని పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ చింతపల్లి రామకృష్ణ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం జనరంజక పాలన అందిస్తుందన్నారు. ఎమ్మెల్సీ వివివి చౌదరి మాట్లాడుతూ అస్తవ్యస్తమైన రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే కూటమి ప్రభుత్వం గాడిలో పెడుతుందన్నారు.
చివరగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లు కష్టించి పాలన సాగిస్తుంటే జగన్ చూసి తట్టుకోలేకపోతున్నాడన్నారు. వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు, రాష్ట్ర రాజధాని లను నిర్లక్యం చేస్తే కూటమి ప్రభుత్వం దీనిని గాడిలో పెడుతుందన్నారు. సాక్షి మీడియా లో దుష్ప్రచారం, మహిళల పట్ల కించపర్చి మాట్లాడటం పెరిగిపోయిందన్నారు. గత వైసీపీ ప్రభుత్వం అమ్మ ఒడి మూడేళ్లు మాత్రమే అమలు చేసిందని, ఈ విషయాన్ని కూటమి శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. అలాగే వైసీపీ ప్రభుత్వం లా బాత్ రూమ్ లు కడగటానికి ఎలాంటి డబ్బులు మినహాయించకుండా మొత్తం డబ్బులను తల్లుల ఖాతాలో జమ చేస్తున్న విషయాన్ని కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. గతంలో ఔరంగజేబు జుట్టు పెంచుకున్న వారికి జిజియా పన్ను విధించినట్టు జగన్ ప్రజలపై వేసిన చెత్త పన్ను ను రద్దు చేసిన ఘనత కూటమి ప్రభుత్వానిదన్నారు. అన్నా క్యాంటిన్ లను ప్రారంభించి పేదవాడి ఆకలి తీర్చిన ఘనత కూటమిదన్నారు.
అప్పుడప్పుడు అన్నాక్యాంటిన్ కు వెళ్ళి తాను భోజనం నాణ్యత పరిశీలించడం జరుగుతుందని, అదే విధంగా కార్యకర్తలు కూడా అప్పుడప్పుడు అక్కడకు వెళ్లి తినాలని సూచించారు. టేకి, మండపేట పట్టణాల్లో రెండు సబ్ స్టేషన్ ల ఏర్పాటు కు చర్యలు తీసుకోవడం జరుగుతుందని, అవి పూర్తయితే నియోజకవర్గం లో ఇక లోఓల్టేజ్ సమస్య ఉండదన్నారు. మండపేట నియోజకవర్గం లోని అన్ని గ్రామాల్లోనూ రాబోయే నాలుగేళ్లలో రోడ్లు, డ్రైన్ లు పూర్తి స్థాయిలో నిర్మించే బాధ్యత తనదని సభాముఖంగా హామీ ఇచ్చారు. మండపేట నియోజకవర్గంలో పింఛన్లు నిమిత్తం 207 కోట్లు వెచ్చించడం జరిగిందన్నారు. మెగా డీఎస్సీ కూడా ఇచ్చిన మాట ప్రకారం అమలు చేస్తున్న ఘనత కూటమిదన్నారు. పోలవరం ప్రాజెక్టు కు 11,400 కోట్లు నిధులు మంజూరయ్యాయన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల భారీగా పరిశ్రమల రూపకల్పనకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాబోయే రోజుల్లో మరింత ప్రజారంజకంగా కూటమి ప్రభుత్వం పాలన సాగించబోతున్నట్లు వేగుళ్ళ తెలిపారు. వేగుళ్ళ మాట్లాడటానికి ముందు టీడీపీ యువనేత లు కుమార్ బాబు, అజయ్ బాబు లు ప్రకాష్ తో కలిసి కేక్ కట్ చేసి వేడుకలు జరిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


