జూన్ 26, 2026
TRINETHRAM NEWS

తేదీ : 12/06/2025. కృష్ణాజిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , కూటమి ప్రభుత్వం గుడివాడ అభివృద్ధికి రూపాయలు ఆరు వందలు కోట్లు నిధులు మంజూరు చేశారని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. అందులో భాగంగా రూపాయలు అరవై కోట్లు నిధులతో అభివృద్ధి పనులు పూర్తి చేసామన్నారు. రాష్ట్రంలో నిర్మితమయ్యే తొలి బస్టాండు గుడివాడలోనే నిర్మిస్తామని అన్నారు. గత ప్రభుత్వం చేతకాని పరిపాలనతో రాష్ట్రాన్ని ఆర్థిక కష్టాలుగా చీకట్లోకి నెట్టారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం ప్రయాణం ఎంతో సాఫీగా సాగుతుందని అనడం జరిగింది. పార్టీలో ఐక్య నిర్ణయంతోనే ముందుకు సాగుతున్నామని అన్నారు.
గుడివాడ అభివృద్ధికి సోదరుడు ఎంపీ బాలసౌరి సహకారం ఎనలేనిది అని తెలిపారు. ఏడాదికిసాధించిన విజయాలతో రాబోయే నాలుగేళ్లలో రెట్టింపుతో ఉత్సాహంతో, పనిచేస్తామన్నారు. రైల్వే గేట్ల వద్ద సమస్యల పరిష్కారానికి ప్లే ఓవర్లు మరియు అండర్ పాసుల నిర్మాణానికి రూపాయలు నాలుగు వందల కోట్లు మంజూరు అవ్వడం జరిగిందని చెప్పారు. అమృత్ పే – రెండు లో భాగంగా పురపాలక సంఘం అభివృద్ధికి రూపాయలు నూట ముప్పై ఆరు కోట్లు మంజూరు అయ్యాయని, అభివృద్ధి పనులు చేపట్టే ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు క్షేత్రస్థాయి పరిశీలన జరుగుతుందన్నారు.

ప్రధాన రహదారుల అభివృద్ధికి నేషనల్ హైవే శాఖ నుండి రూపాయలు 35.23 కోట్ల మంజూరయ్యాయని, ఆ పనులు కూడా అతి త్వరలో ప్రారంభం అవుతాయని ఎమ్మెల్యే రాము తెలపడం జరిగింది. రూపాయలు 15.62 కోట్ల (యన్ ఆర్ జి యస్) నిధులతో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గ్రామాల్లో రెండు వందల డెబ్బై ఆరు రోడ్లు నిర్మాణం పూర్తి అయిందన్నారు. రూపాయలు పది కోట్ల నిధులతో కాలవలు, డ్రైనేజీలలో జరుగుతున్న అభివృద్ధికి పనులు చివరి దశకు చేరుకున్నాయన్నారు. ఇతర అభివృద్ధి పనులన్నీ వివిధ దశలో ఉన్నట్లు తెలియజేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

The alliance journey will

You cannot copy content of this page