Chairperson Rani : ప్రభుత్వ తోడ్పాటు అందిపుచ్చుకోవాలి

TRINETHRAM NEWS

చైర్ పర్సన్ రాణి…

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, మండపేట : ప్రభుత్వ తోడ్పాటు అందిపుచ్చుకోవాలనీ మండపేట పుర పాలక సంఘం చైర్ పర్సన్ పతి వాడ నూక దుర్గా రాణి పేర్కొన్నారు.మండపేట పట్టణం 20వ వార్డు సర్దార్ శ్రీ వేగుళ్ళ వీర్రాజు మున్సిపల్ హై స్కూల్ లో గురువారం జరిగిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్స్ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ పతివాడ నూక దుర్గారాణి ముఖ్య అతిధి గా పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు,బ్యాగ్ లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వాలు అందిస్తున్న తోడ్పాటును విద్యార్థులందరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

అనంతరం అదే పాఠశాలలో 6సంవత్సరాల పాటు విశేష సేవలు అందిచి బదిలీ పై వెళ్తున్న ప్రధానోపాధ్యాయులు పి.వి.వి.ఎల్.ఎన్ మూర్తి ను సత్కరించారు.ఈ కార్యక్రమంలో మండపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ మేడింటి సూర్య ప్రకాష్, కౌన్సిలర్ మందపల్లి రవి కుమార్,పాఠశాల ఎస్ ఎం సి చైర్మన్ ఇల్లూరి కామేశ్వరరావు,హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు ఎం కె పి వాణి,ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు కె సత్తిబాబు, వైస్సార్సీపీ నాయకులు యరమాటి వెంకన్నబాబు, కార్యకర్తలు పేరూరి మాధవి,పీనెడ్డి కృపావతి,కొమ్మోజు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Government support should be

You cannot copy content of this page

Scroll to Top