Adivasi JAC : రోడ్డుకి ఇరువైపులా 50,50 అడుగులలో ఆక్రమణలు తొలిగించాల్సిందే

TRINETHRAM NEWS

అల్లూరిజిల్లా, త్రినేత్రం న్యూస్, ఆర్ అండ్ బి రోడ్డు కి కుడి, ఎడమలలో 50,50 అడుగులలో మొత్తం 100 అడుగులలో ఉన్న ఆక్రమణలు తొలిగించాల్సిందేనని, ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసీ జెఏసి రాష్ట్ర వైస్ ఛైర్మన్ మొట్టడం రాజబాబు డిమాండ్ చేసారు.ఉన్నత న్యాయస్థానం ఆదేశాల అనుసరించి రోడ్డుకి ఇరువైపులా ఉన్న అక్రమ నిర్మాణాలను 8 నెలలలో తొలిగించాలని, అల్లూరి సీతారామరాజు జిల్లాకలెక్టర్ ఆదేశాలు జారీ చేయడం యావత్తు ప్రజానీకం హర్షం వ్యక్తం చేస్తుండగా,ఆ ఆదేశాలను కొంతమంది తహశీల్దార్లు బేఖాతరు చేస్తున్నారు. ఆక్రమణదారులు,అధికారులు మధ్య సంధి కుదిరి,రోడ్డు మధ్య భాగం నుండి 50 అడుగులలోపు మార్కింగ్ ఇవ్వాలని ఆక్రమణదారులు కోరగా కొంతమంది తహశీల్దార్లు ఒక్కొక్క అడుగుకు ఒక్కొక్క రేటు పెట్టినట్లు తెలిసింది. 5 వ షెడ్యూల్డ్ ప్రాంతాల్లో భూబదాలయింపు నిషేధ చట్టం ప్రకారం గిరిజనేతరులు సూది మొన మోపడానికి కూడా వీలు లేదు. ఈ విషయాన్ని తహాశీల్ధార్లకు ఎన్నో సార్లు ఆదివాసీ జెఏసి చెప్పి, వినతి పత్రాలు ఇచ్చిన తహాశీల్ధార్లు పట్టించుకోకుండా గిరిజనేతరులకు, అండగా ఉంటూ అక్రమంగా శాశ్వత నిర్మాణాలు నిర్మించుకోవడానాకి సహాకరించారు.

కొంతమంది దగుల్బాచిలు ఎంగిమెతుకులకు ఆశపడి బినామీలుగా మారారు.ఎప్పటి నుండో చాలా మంది ఆదివాసిలు,ఆదివాసీ సంఘాలు కోరుతుంటే ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన ఆర్డర్ ని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ తూచ తప్పకుండా అమలు చేస్తుంటే క్షేత్ర స్థాయిలో ఉన్న తహశీల్దార్లు మాత్రం గిరిజనేతరలతో సమావేశమై ముడుపులు తీసుకొని మార్కింగ్ మార్చేస్తున్నారు. 5 వ షెడ్యూల్డ్ ప్రాంతాన్ని కాపాడుకునేందుకు అందరం కృషి చేద్దామని, గిరిజనేతరులు కూడ నాయకులను నమ్మి నష్ట పోవద్దని, అధికారులకు, నాయకులకు, అఖరికి ఆదివాసీ జెఏసి పేరుతో ఎవరైనా డబ్బులు అడిగిన ఇవ్వవద్దని, ప్రస్తుతం ఆర్ అండ్ బి రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలు తొలగిస్తున్నారు, భవిష్యత్తులో గడ్డ పోరం బోకులు,గ్రామ కంఠాలు, ప్రభుత్వానికి కేటాయించిన స్థలాలు ఆక్రమణ గురైతే గుర్తించి తొలిగించడం జరుగుతుందని,నాయకులను నమ్మి ఎవ్వరూ నష్ట పోవద్దని,చట్టం అమలు అవుతూ ఉంటాదని, ఈ రోజు కాకపోతే రేపైనా చట్టమే అమలు అవుతుందని,ఇప్పుడే జాగ్రత్త పడాలని,ఎవరినైనా నమ్మి నష్టపోతే దానికి బాధ్యులు వారేనని, ఆదివాసి జేఏసి హెచ్చరించారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Encroachments should be removed

You cannot copy content of this page

Scroll to Top