WhatsApp Image 2024 01 16 at 7.20.50 PM
Trinethram News : ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం పాత మల్లాపురంలో మంగళవారం అక్రమంగా మద్యం తరలిస్తున్న ఓ వ్యక్తిని బేస్తవారిపేట ఎస్ఐ నరసింహారావు అదుపులోకి తీసుకున్నారు. అదుపులోకి తీసుకున్న వ్యక్తి వద్ద నుండి 32(180ఎం.ఎల్) మద్యం బాటిల్లను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ నరసింహారావు వెల్లడించారు. అక్రమంగా మద్యం అమ్ముతున్న వ్యక్తిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ నరసింహారావు తెలిపారు. అక్రమంగా మద్యం అమ్మితే చట్టపరమైన చర్యలు తప్పవని అన్నారు.
