MLA Jare : నియోజకవర్గ ప్రజలకు అండగా నిలబడటం ప్రజాప్రతినిధిగా నా భాద్యత ఎమ్మెల్యే జారె

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ / భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట నియోజకవర్గం. అశ్వారావుపేట నియోజకవర్గం దమ్మపేట, అశ్వారావుపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డిపల్లి మండలాలకు చెందిన పేద మధ్యతరగతి ప్రజల ఆరోగ్య సమస్యలను దృష్టిలో ఉంచుకుని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మానవతా దృక్పథంతో ముందడుగు వేస్తున్నారు. నియోజకవర్గంలోని ఐదు మండలాలలో అనారోగ్యంతో ప్రయివేట్ ఆసుపత్రులలో ట్రీట్మెంట్ పొందిన వారు ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా ఆర్థిక సహాయం కోసం దరఖాస్తు చేసుకోగ ఆన్లైన్ ప్రక్రియను పూర్తి చేయించి హైదరాబాద్ ముఖ్యమంత్రి సహాయనిధి విభాగంలో 245 అప్లికేషన్లను స్వయంగా అధికారులకు అందజేశారు. సంబంధిత బాధితులకు వీలైనంత త్వరగా సహాయం అందించాల్సిందిగా అధికారులను కోరారు పేద ప్రజలకు అవసరమైన సమయంలో అండగా ఉండడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యతని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

It is my responsibility as

You cannot copy content of this page

Scroll to Top