Coalition Government : ముగ్గులతో మెరిసిన ఉభలగరువు గ్రామం కూటమి ప్రభుత్వ విజయానికి సంవత్సరోత్సవంగా నిర్వహించిన వేడుకలు

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ జూన్ 5: అల్లూరి సీతారామరాజు జిల్లా, పాడేరు నియోజకవర్గంలోని మొండికోట, ఉభలగరువు గ్రామంలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధికార ప్రతినిధి బొంకుల దివ్యలత, జి. మాడుగుల మండల అధ్యక్షుడు మసాడి భీమన్న సమన్వయంతో నిర్వహించారు.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జనసేన పార్టీ పాడేరు అసెంబ్లీ మరియు అరకు పార్లమెంట్ ఇంచార్జ్ వంపూరు గంగులయ్య హాజరయ్యారు. ముందుగా గ్రామ మహిళలు గిరిజన సంప్రదాయాలను పాటిస్తూ గంగులయ్యను ఘనంగా ఆహ్వానించారు.
దేశ రాజకీయాల్లో చిరస్థాయిగా నిలిచే విధంగా రాక్షస పాలనకు తెరపడిన ఈ రోజు, కూటమి ప్రభుత్వం ఏర్పడి ప్రజాసౌమ్య పరిరక్షణకు నాంది పలికిన రోజు అని వంపూరు గంగులయ్య పేర్కొన్నారు. ఈ సందర్భాన్ని దీపావళి, సంక్రాంతిలా వేడుకలతో జరుపుకోవాల్సిన ప్రత్యేక దినంగా అభివర్ణించారు.
ప్రధాని నరేంద్ర మోదీ కేంద్రంలో, రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో ఏర్పడిన కూటమి ప్రభుత్వానికి ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జనసేన శ్రేణులు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయని గంగులయ్య తెలిపారు.
ముగ్గుల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేసి వారిని ప్రోత్సహించారు. ఈ కార్యక్రమంలో జి. మాడుగుల మండల గౌరవ అధ్యక్షుడు తెరవాడ వెంకట రమణ, ఐటీ టీమ్ కో ఆర్డినేటర్ సీ.హెచ్. అనిల్ కుమార్, మండల నాయకులు తల్లే త్రిమూర్తులు, ఉమ్మడి జిల్లా కార్యనిర్వహణ సభ్యులు తాంగుల రమేష్, ముదిలి సుబ్బారావు, రాంబాబు, కోటిబాబు, పి. ప్రవీణ్ కుమార్, కె. రామానందం, వీరమహిళ గండేరి పార్వతమ్మ తదితరులు పాల్గొన్నారు. గ్రామస్తులు, మహిళలు పెద్దఎత్తున పాల్గొనడం విశేషం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Ubhalagaruvu village shines with

You cannot copy content of this page

Scroll to Top