తేదీ : 04/06/2025. ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , చింతలపూడి నియోజకవర్గం, మండలంలో ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఐ.వీ విశ్వనాథ్ ప్రమోషన్ లో భాగంగా ప్రిన్సిపల్ బాధ్యతలు స్వీకరించడం జరిగింది. ఆయన ఏలూరు జిల్లా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్ గా పనిచేశానని చెప్పారు. విద్యార్థులకు మరియు వాళ్ల తల్లిదండ్రులకు సంబంధిత సిబ్బంది కి ఆయనంటే అభిమానం. విద్యార్థుల పట్ల ఆయన కు మరియు లెక్చరర్లకు మక్కువ. ఈ సంవత్సరం ఫలితాలు బాగా వచ్చాయని తెలిపారు. టీ నర్సాపురం, మక్కిన వారి గూడెం, తిరుమల దేవి పేట తదితర ప్రాంతాల నుండి విద్యార్థిని విద్యార్థులు కళాశాలకు రావడం జరుగుతుంది అని పేర్కొన్నారు. అదేవిధంగా బైపిసి, ఎంపీసీ, హెచ్ సి సి, సిఇసి , గ్రూపులు ఉన్నాయని తెలిపారు. కళాశాల సమయం ప్రకారం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు పనిచేస్తున్నామని అన్నారు.
విద్యార్థులకు క్రమశిక్షణతో కూడిన విద్య, క్రీడలు అందిస్తున్నామని తెలిపారు. ఈ సంవత్సరం విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, మెటీరియల్స్, నోట్ బుక్స్ ఈ విధంగా మధ్యాహ్నం భోజన పథకం కింద పౌష్టిక ఆహారాన్ని అందిస్తున్నామని అన్నారు. మెడికల్, ఇంజనీరింగ్, ఐఐటి ఫౌండేషన్ తదితర మెటీరియల్స్ కూడా అందించి విద్యార్థులకు కార్పొరేట్ కళాశాలకు దీటుగా విద్యను అందిస్తున్నామని అన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పిన విధంగా పాటిస్తున్నామని అన్నారు. ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు విద్యార్థుల పట్ల మా బాధ్యత పూర్తిగా ఉంటుందని, కళాశాల అవగానే బయటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రుల బాధ్యత ఉంటుందని తెలిపారు.
ప్రిన్సిపాల్ గా బాధ్యత స్వీకరించడం దేవుడిచ్చిన పరమని అన్నారు . కాంట్రాక్టు బేసిక్ లెక్చరర్స్ . యు. శ్రీనివాసరావు (బోటనీ), ఎం. జయ శ్రీ (ఫిజిక్స్), ఎం. సంజీవరావు (సివిక్స్ మరియు హిస్టరీ), సిహెచ్. ఉమామహేశ్వర రావు (ఇంగ్లీష్), డి. ప్రిస్కెల్ల ప్రేమ కుమారి. ( ఈ ఇ టి), కె. అనిత కుమారి (ఎం పి హెచ్ డబ్ల్యు), కె. హరిణి (ఎం పి హెచ్ డబ్ల్యు),టి. మధు (జువాలజీ), ఎం. లక్ష్మీకాంత (కెమిస్ట్రీ), పి. సురేష్ కుమార్ (గణితం), కె. విజయ కుమారి (కామర్స్), కె.వి. కృష్ణా రాజు (తెలుగు) అని వివరించారు. విద్యార్థులు మరియు తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యానికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


