100-Day Plan Rally : దేవరకొండలో ఘనంగా 100రోజుల ప్రణాళిక ర్యాలీ

TRINETHRAM NEWS

పట్టణ అభివృద్దే లక్ష్యం . …మున్సిపల్ కమీషనర్. వై సుదర్శన్.

దేవరకొండ జూన్ 03 త్రినేత్రం న్యూస్. దేవరకొండ మున్సిపాలిటీలో 100రోజుల ప్రణాళిక ఉత్సహంగా ప్రారంభమైంది. ఈసందర్భంగా స్థానిక మున్సిపాలిటీ కార్యాలయంనుండి బస్టాండ్ వరకు భారీర్యాలీ నిర్వహించడం జరిగింది.అనంతరం ప్రత్యేక ప్రతిజ్ఞ కార్యక్రమం చేపట్టారు. ఈర్యాలిలో పాల్గొన్న మున్సిపల్ కమిషనర్ వై సుదర్శన్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు వందరోజుల ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు.
ఈ ప్రాణాలికలో భాగంగా పారిశుద్ధ్యం మెరుగుపరచడం, పట్టణ అభివృద్ధి కి నూతన ప్రణాళికలు సిద్ధం చేయడం, మరియు ప్రజలకు మంచినీటి సౌకర్యం మెరుగైన నీటి సరఫరా అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు ఆయన వివరించారు. పట్టణ ప్రజల ల సహకారంతో ఈ ప్రణాళికను విజయవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ శంకర్, ఏఈ రాజు , టి పి బి ఓ వర్షిత, సీనియర్ అసిస్టెంట్ రాకేష్, ఎన్విరా న్మెంట్ ఇంజనీర్ శక్రు నాయక్, మెప్మా టిఎంసి జగమంతూ, వార్డు అధికారులు మున్సిపల్ కార్యాలయం సిబ్బంది, మహిళా సంఘం సభ్యులు,, ఆర్ పి లు, మరియు పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

100-day plan rally

You cannot copy content of this page

Scroll to Top