Telangana Formation Day : జనసేన పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహణ

TRINETHRAM NEWS

తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ జూన్ 2 : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కూకట్ పల్లి లోని జనసేన పార్టీ కార్యాలయంలో వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర జనసేన పార్టీ ఇంచార్జ్ నేమూరి శంకర్ గౌడ్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ జెండాను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది ఎప్పటికీ మర్చిపోలేని చరిత్ర. ఈ గొప్ప తెలంగాణ రాష్ట్రం ఎన్నో త్యాగాలు, కష్టసుఖాల మధ్య నిర్మాణం పొందిందని తెలిపారు.ఆ పోరాటం ప్రజల ఐక్యతకు సాక్ష్యం.

తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిజం చేయాలన్న దృక్పథం జనసేన పార్టీకి ఎల్లపుడు ఉంది అని అన్నారు.అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలంగాణపై ఎంతో ప్రేమ చూపిస్తున్నారు అని శంకర్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రతి సందర్భంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గళం విప్పారు.భవిష్యత్తులో జనసేన పార్టీ తెలంగాణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించబోతోంది.అనడంలో ఎటువంటి సందేహం లేదని తెలిపారు. ఈ విషయంలో మన నేత పవన్ కళ్యాణ్ మార్గదర్శనం మాకు బలాన్ని ఇస్తోంది అని స్పష్టం చేశారు.
తెలంగాణలో జనసేన కార్యకర్తలకు భరోసా ఇచ్చే విధంగా పార్టీ నిర్మాణం అతి త్వరలో జరుగుతోంది. ప్రతి కార్యకర్తకు గౌరవం ఉండేలా, ప్రజల సమస్యలపై పోరాటం చేసేలా జనసేన తర్వలోనే బలంగా ఎదుగుతుంది దానికి సంబంధించిన కార్యాచరణ ఇప్పటికే మొదలైందని అని తెలిపారు.ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ వీర మహిళ నాయకులు కావ్య మండపాక ,శిరీష , అనిత గాలి ,ద్రాక్షాయణి ,జనసేన నాయకులు, యడమ రాజేష్, మండలి దయాకర్ , మాధవరెడ్డి, కొల్లా శంకర్ భోగాది వెంకటేశ్వరరావు , కార్యకర్తలు, రామలింగం జనసేన పార్టీ నాయకులు , వీర మహిళలు పాల్గొని తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని స్ఫూర్తిదాయకంగా జరిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Telangana State Formation Day

You cannot copy content of this page

Scroll to Top