Trinethram News : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. తెనాలిలో రౌడీ షీటర్లపై పోలీసులు ఓపెన్ ట్రీట్ మెంట్‌పై హోంమంత్రి అనిత స్పందించారు. శాంతి భద్రతలను కంట్రోల్ చేయాల్సింది పోలీసులేనని తెలిపారు. తప్పు చేసిన వారికి కులం ఏంటి మతం ఏంటని ప్రశ్నించారు. పోలీసులపై దాడి చేసే వారికి కూడా రాజకీయ రంగు పులమటం ఏంటని నిలదీశారు. గత జగన్ ప్రభుత్వంలో డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగితే రెక్కలు విరిచి కొట్టారని మండిపడ్డారు హోంమంత్రి వంగలపూడి అనిత.
గతంలో సీఎం చంద్రబాబు అమరావతికి వెళ్తే రాళ్లు విసిరీ భావ స్వేచ్ఛ ప్రకటన అని అన్నారని హోంమంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) గుర్తుచేశారు. టీడీపీ ఆఫీసుపై దాడి చేస్తే తమ కార్యకర్తలకు బీపీ వచ్చిందని జగన్ అనలేదా అని నిలదీశారు. సజ్జలకు మాట్లాడే అర్హత లేదని ధ్వజమెత్తారు. గత ప్రభుత్వ హయంలో పోలీస్ శాఖ సీఎం , హోం మంత్రి చేతుల్లో లేదని.. సజ్జల(Sajjala Ramakrishna Reddy) కనుసన్నల్లో మాత్రమే గత జగన్ ప్రభుత్వం నడిచిందని ధ్వజమెత్తారు. తాము పోలీసులను చట్టపరంగా పని చేసే స్వేచ్చను ఇచ్చామని చెప్పారు. వైసీపీ నాయకులు సిగ్గులేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని హోంమంత్రి వంగలపూడి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


