Collector Koya Sri : పశువుల అక్రమ రవాణా నివారణకు పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష

TRINETHRAM NEWS

అక్రమ రవాణా పాల్పడే వారి పై కఠిన చర్యలు

పెద్దపల్లి, మే-31: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. బక్రీద్ పండుగను పురస్కరించుకొని పశువుల అక్రమ రవాణా నిరోధానికి జిల్లాలో అధికారులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శనివారం జూన్ 7 న బక్రీద్ పండుగ సందర్భంగా ఆవులు, ఎద్దులు, కోడె దూడలను అక్రమంగా తరలించకుండా జిల్లాలో 3 చెక్ పోస్ట్ లను బసంత్ నగర్ దుబ్బపల్లి, గుంపుల వద్ద ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పోలీసు, పశుసంవర్ధక శాఖ అధికారులు సంయుక్తంగా చెక్ పోస్ట్ లలో విధులు నిర్వహిస్తున్నారని ,

ఈ చెక్ పోస్టుల 24 గంటల పాటు పనిచేస్తాయని అవసరమైతే మరో చెక్ పోస్ట్ కూడా ఏర్పాటు చేస్తామని కలెక్టర్ తెలిపారు పశువుల తరలించే వాహనం వాహన డ్రైవర్ వివరాలు ఉన్న వారి అమ్మిన వారి వివరాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు తీసుకెళ్తున్నారని వివరాలను అధికారులు పరిశీలిస్తారని తెలిపారు. మరియు పశువుల మార్కెట్ (సంత)లో కూడా పశువులను కొనడం కానీ అమ్మడం కానీ చేయడం వెంటనే నిలిపివేయాలని, బక్రీద్ పండుగకు అక్రమంగా ఆవులు ఎద్దులు లేక దూడలను రవాణా అడ్డుకోవడం లక్ష్యంగా పనిచేస్తున్నామని ప్రజలు కూడా పూర్తిగా సహకరించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

District Collector Koya Sri

You cannot copy content of this page

Scroll to Top