జూన్ 27, 2026
TRINETHRAM NEWS

సామర్లకోట మున్సిపాలిటీలో ప్రతినెల జరగవలసిన కౌన్సిల్ సమావేశం మే నెలకి సంబంధించి సమావేశం ఏర్పాటు చేయకపోవడంతో వైసిపి కౌన్సిలర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ మున్సిపల్ కార్యాలయం వద్ద తమ నిరసనను తెలియజేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ వైస్ చైర్మన్ ఊబా జాన్ మోజెస్ మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్న సమయంలో సైతం కౌన్సిల్ సమావేశాలు యధావిధిగా జరపగా,ఈనెలలో సమావేశం నిర్వహించడంలో అధికారులు ఎందుకు తాత్సరం చేస్తున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు.

పట్టణంలో అనేక సమస్యలు అభివృద్ధి పనులకు సంబంధించి సమావేశంలో చర్చ జరగాల్సి ఉండగా వాటిని పక్కదారి పట్టించే విధంగా అధికారులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. దీనిపై కమిషనర్ స్పందించి కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం మున్సిపల్ కమిషనర్ శ్రీ విద్యను కలిసి వినతి పత్రం అందజేశారు.ఈ కార్యక్రమంలో వైసిపి కౌన్సిలర్లు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

YCP councilors protest against

You cannot copy content of this page