త్రినేత్రం న్యూస్, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణం, 21వ వార్డులో శనివారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఫించన్లు పంపిణీ కార్యాక్రమంలో పాల్గొని అర్హులైన వార్కి ఫించన్లు పంపిణీ చేశారు. పింఛన్లు సక్రమంగా అందుతున్నాయా లేదా అని ఈ సంధర్బంగా లబ్దిదారులను అడిగి తెలుసుకున్నారు. లబ్ధిదారులు తమకు సక్రమంగానే అందుతున్నాయని పింఛన్ పెంచడం వల్ల తమకు ఆర్థికంగా వెసులుబాటు కలుగుతుందని తెలిపారు.
ఈ సంధర్బంగా ఆయన మాట్లాడుతూ భారత దేశంలోనే అత్యధికంగా పెన్షన్ పంపిణీ చేస్తున్న రాష్ట్రం ఏదైనా ఉంది అంటే అది ఒక ఆంధ్రప్రదేశ్ మాత్రమే అని అన్నారు. ఒకటో తారీఖు సెలవు దినం కావడంతో ముందుగా 31వ తేదినే వారి ఇళ్ళకు వెళ్లి ఫించను ఇవ్వటం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయ సంస్ధ మాజీ చైర్మన్ నల్లమిల్లి వీర్రెడ్డి, మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, సచివాలయ సిబ్బంది, తదితర్లు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


