రేషన్ వాహనాల రద్దుపై డీలర్ల హర్షం వ్యక్తం
కార్డుదారులందరికీ రేషన్ సరకులు అందించడానికి రేషన్ డీలర్లు కృషి చేయాలి…ఎమ్మెల్యే వేగుళ్ళ…
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, కపిలేశ్వరం మండలం రేషన్ వాహనాలను రద్దు చేసి మళ్లీ చౌక ధరల దుకాణాల ద్వారా సరుకులు పంపిణీ చేయాలన్న నిర్ణయంపై కపిలేశ్వరపురం మండల రేషన్ డీలర్లు హర్షం వ్యక్తం చేశారు. డీలర్స్ ఫ్రెండ్లీ ముఖ్యమంత్రి అంటూ చంద్రబాబుకు ఓ ప్రకటనలో కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంధర్భంగా మండపేట తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో కపిలేశ్వరపురం మండల రేషన్ డీలర్లు శక్రవారం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,ని మర్యాదపూర్వకంగా కలిసి దుశ్శాలువాతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. పూర్వ వైభవం తీసుకొచ్చినందుకు పలువురు డీలర్లు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ సంధర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ అధిక శాతం ప్రజలు రేషన్ దుకాణాల వద్దే సరకులు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని, కార్డుదారులందరికీ చౌకబియ్యం అందించడానికి డిపో డీలర్లు కృషి చేయాలని సూచించారు. వృద్ధులు, దివ్యాంగులకు మాత్రమే రేషన్ డోర్ డెలివరీ జరుగుతుందని ఎమ్మెల్యే వేగుళ్ళ వివరించారు . అలాగే బియ్యం అక్రమ రవాణా పూర్తిగా అరికట్టే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని, గత వైసీపీ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఇంటింటికీ బియ్యం కార్యక్రమం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సిహెచ్ కొండబాబు, వార సుబ్బారావు, కే విజయ్ కుమార్, మాత వెంకటరమణ, ఎం. రామకృష్ణయ్య, దుర్గ భవాని, సాదే శ్రీదేవి,పలివెల వెంకటరమణ, రేషన్ డిపో డీలర్లు, తదితర్లు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


