MLA Vegulla : ప్రజలంతా యోగాని నిత్యం అభ్యసించాలి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మండపేట పట్టణంలో బాబు మరియు బాబు కన్వెన్షన్ నందు యోగాంధ్ర– 2025లో భాగంగా ప్రముఖ సత్యసాయి ధ్యానమండలి, విజయవాడ శ్రీ రఘు గురువు, అధ్వర్యంలో నిర్వహించబడిన యోగా కార్యక్రమానికి రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో యోగా మాస్టారు రఘు గురువు, ఆయన సహయకులు తిరుపతిరాజు, పాల్గొన్నవారందరిచే యోగాసనాలు వేయించారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుళ్ళ మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని యోగా కార్యక్రమాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించిందన్నారు.

అందులో భాగంగా మండపేట పట్టణంలోని బాబు & బాబు కన్వెన్షన్ నందు యోగాంధ్ర కార్యక్రమాన్ని మంచి ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు మంచి ఆలోచనతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యోగాంధ్ర కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రజలంతా యోగాని నిత్యం అభ్యసించి తద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చుండ్రు శ్రీ వర ప్రకాష్, 6వ వార్డు కౌన్సిలర్ కాశిన కాశీవిశ్వనాధం, మున్సిపల్ కమీషనర్ టి.వి.రంగారావు, తదితర్లు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

All people should practice

You cannot copy content of this page

Scroll to Top