Good News for Women : మహిళలకు గుడ్‌న్యూస్

TRINETHRAM NEWS

తల్లికి వందనం నగదు జమ, ఉచిత బస్సుపై చంద్రబాబు ప్రకటన

Trinethram News : వచ్చే నెలలో తల్లికి వందనం కింద ఎంత మంది పిల్లలుంటే అంత మందికి రూ.15 వేలు ఇస్తాం. ఆగస్టు 15 నుంచి మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణం కల్పిస్తాం. ఇప్పటికే దీపం కింద 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాం. డ్వాక్రా సంఘాలతో మహిళా సాధికారత వస్తుంది. మహిళలు రాజకీయంగా, ఆర్థిక, సామాజికంగా మగవారితో సమానంగా ఉండాలన్నే నా సంకల్పం. పురుషులు ఈ విషయంలో సహకరించాలి. ఆడబిడ్డలు బాగుంటే అక్కడ మనకు మంచి జరుగుతుంది. 50 రూపాయలకే కరెంట్ ఇచ్చాం.

తాగునీటి, సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇచ్చాం. పామాయిల్ సాగు తీసుకొచ్చాం. రాయలసీమను సస్యశ్యామలం చేసిన పార్టీ టీడీపీ. ఉత్తరాంధ్ర ఏజెన్సీ ఏరియాలో అరకు కాఫీ ప్రపంచంలోనే బ్రాండ్ గా మారుతోంది. రాయలసీమలో హార్టికల్చర్, కోస్తాంధ్రంలో వాణిజ్య పంటలకు సహకారం అందిస్తాం. పోలవరం ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేస్తాం. రైతులకు మూడు విడతల్లో వారికి ఆర్థిక సాయం అందించడంతో పాటు గిట్టుబాటు ధర కల్పిస్తాం.

ఆస్తిలో మహిళలకు హక్కు ఇచ్చింటి ఎన్టీఆర్, ఆ తరువాత డ్వాక్రా మహిళల వ్యవస్థ తీసుకొచ్చాను. ఉద్యోగాలు, కాలేజీ సీట్లలో వారికి అవకాశాలు పెంచాం. ఆడబిడ్డలపై ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే వారికి అదే రోజు చివరిరోజు అవుతుంది. 22 మంది మహిళలకు ఎమ్మెల్యే సీట్లు ఇస్తే 20 మంది గెలిచారు.

డ్వాక్రా సంఘాల మహిళలను లక్షాధికారులు కడపలో మాధవిరెడ్డిని అంతా తక్కువ అంచనా వేశారు. రిజల్ట్ చూస్తే ఆమె అదరగొట్టింది. మహిళా శక్తి అంటే అదే’ అన్నారు చంద్రబాబు. నన్ను అక్రమ కేసుల్లో జైల్లో పెట్టిన సమయంలో ప్రపంచ వ్యాప్తంగా 100 దేశాల్లో 52, 53 రోజులు పోరాటం చేశారు. నా మీద వారికున్న అభిమానం అలాంటిది’ అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for women

You cannot copy content of this page

Scroll to Top