Starlink Prices : ఇండియాలో స్టార్ లింక్ ఇంటర్నెట్ ధరలు

TRINETHRAM NEWS

Trinethram News : ఎలాన్ మస్క్ నేతృత్వంలోని స్టార్‌లింక్, ఉపగ్రహ ఆధారిత ఇంటర్నెట్ సేవల ద్వారా ప్రపంచవ్యాప్తంగా కనెక్టివిటీని అందిస్తోంది. ఈ క్రమంలో భారతదేశంలో త్వరలో తన కార్యకలాపాలను ప్రారంభించనున్న స్టార్‌లింక్, అత్యాధునిక సాంకేతికతతో అతి తక్కువ ధరల్లో హై-స్పీడ్ ఇంటర్నెట్‌ను అందించనుంది.

టెలికమ్యూనికేషన్ శాఖ వర్గాల ప్రకారం, స్టార్‌లింక్ 12 నెలల్లో 600 నుంచి 700 Gbps (గిగాబైట్స్ పర్ సెకండ్) బ్యాండ్‌విడ్త్‌తో భారత మార్కెట్లోకి అడుగుపెట్టనుంది. ఈ సేవలు ముఖ్యంగా గ్రామీణ, మారుమూల ప్రాంతాల్లో ఇంటర్నెట్ వినియోగాన్ని విప్లవాత్మకంగా మార్చనున్నాయి.

స్టార్‌లింక్ భారత మార్కెట్‌లో సరసమైన ధరలతో పోటీపడనుందని నివేదికలు సూచిస్తున్నాయి. ప్రారంభ ప్రమోషనల్ ఆఫర్‌లో నెలకు కేవలం రూ.840 ($10) ధరకే అపరిమిత డేటా అందించే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి.

ఈ ధర దేశీయ టెలికాం దిగ్గజాలైన జియో, ఎయిర్‌టెల్‌లతో పోలిస్తే తక్కువగా ఉండటం విశేషం. అయితే, ఈ ధర ప్రారంభ ఆఫర్‌కు మాత్రమే పరిమితం కావచ్చు. రెగ్యులర్ ప్లాన్‌లు కొంత ఎక్కువ ధరలో ఉండవచ్చని అంచనా.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Starlink Internet Prices in

You cannot copy content of this page

Scroll to Top