Bandi Ramesh : కెపిహెచ్బి కాలనీ వసంతనగర్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించిన బండి రమేష్

TRINETHRAM NEWS

కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 28 : విశ్వవిఖ్యాత నటసార్వభౌమ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారకరామారావు తెలుగుజాతి వెలుగు బావుట, తెలుగుజాతి కీర్తి పతాక అని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ పేర్కొన్నారు.ఎన్టీఆర్ 102 జయంతి వేడుకలు బుధవారం కూకట్పల్లి నియోజకవర్గంలో ఆయన అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కెపిహెచ్బి కాలనీ వసంతనగర్ లోని బస్ స్టాప్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి రమేష్ ఘనంగా నివాళులర్పించారు. నటుడిగా కళారంగానికి, రాజకీయ నాయకుడిగా తెలుగు ప్రజలకు ఆయన సేవలు చీరస్మరణీయమన్నారు. ముఖ్యమంత్రిగా పాలనలో ఆయన చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు దేశంలో ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచాయఅన్నారు. మహిళలకు తొలిసారిగా ఆస్తిలో హక్కును కల్పించిన ఘనత ఎన్టీఆర్ దే అన్నారు.

ఆయన పేరులోనే వైబ్రేషన్ ఉందన్నారు.ఎన్టీఆర్ క్రమశిక్షణ పట్టుదల దీక్షతో ఎదిగి తెలుగు ప్రజలందరికీ ఆరాధ్య దైవంగా మారారు అన్నారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ఓ గుర్తింపును గౌరవాన్ని సాధించిపెట్టిన ఆయన జీవితం ధన్యం అన్నారు. నేటి యువతకు ఎన్టీఆర్ జీవితం ఒక గ్రంథంలా ఉపయోగపడుతుందన్నారు. ఎన్టీఆర్ కుల మత ప్రాంతీయ తత్వాలకు అతీతంగా ఎదిగిన నాయకుడు అన్నారు. ఈ కార్యక్రమంలో గాలి బాలాజీ, గొట్టిముక్కల వెంకటేశ్వరరావు, ప్రవీణ్ కుమార్, దినేష్ కుమార్, శివ కుమార్ గౌడ్, ఫన్నీ, అప్పారావు, ఎస్ మధు, శ్రీనివాస్ బాబు, కే సత్యనారాయణ, భాను, లక్ష్మీనారాయణ, యుగేందర్, శ్రీను, శ్రీనివాసరావు, సాయిబాబా చౌదరి, శివ చౌదరి ,రమణ, అస్లాం తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Bandi Ramesh paid tribute

You cannot copy content of this page

Scroll to Top