Chirla Jaggi Reddy : ఎండియు వెహికల్ ఆపరేటర్స్ చేస్తున్న నిరసనకు, మద్దతుగా చిర్ల జగ్గరెడ్డి

TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. ఏండియూ వెహికల్ ఆపరేటర్స్ చేస్తున్న నిరసన కార్యక్రమంలో వారికి మద్దతుగా పాల్గొన్న అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి.. వై.యస్.జగన్ మీద అక్కసుతో ప్రజల మీద కక్ష సాధిస్తున్న కూటమి ప్రభుత్వం…. చిర్ల జగ్గిరెడ్డి

రాష్ట్రంలో సుమారు 9,600 మంది ఉపాధి కొంపలు కూల్చేసి చంద్రబాబు, కుప్పంలో కొత్తగా కట్టుకున్న కొంపలో ప్రశాంతంగా ఉండగలరా?? ……చిర్ల జగ్గిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రివర్యులు వైయస్ జగన్మోహన్ రెడ్డి, గత ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన “ఇంటింటికి రేషన్” పథకాన్ని ఇప్పటి కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. ఇంటింటికి రేషన్ పథకం నిర్వీర్యం వల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 9600 కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆ కారణంగా ఈరోజు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎండియు వెహికల్ ఆపరేటర్స్ మరియు హెల్పర్స్ అందరూ కలిసి అమలాపురం కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ కార్యక్రమానికి మద్దతుగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు చిర్ల జగ్గిరెడ్డి, అమలాపురం పరిశీలకురాలు జక్కంపూడి విజయలక్ష్మి, జడ్పీ చైర్మన్ విపత్తి వేణుగోపాలరావు గారు, ఎమ్మెల్సీలు కుడుపూడి సూర్యనారాయణ, బొమ్మి ఇశ్రాయేల్, పొన్నాడ వెంకట సతీష్ కుమార్, గన్నవరపు శ్రీనివాసరావు, పాముల రాజేశ్వరి దేవి, గొల్లపల్లి డేవిడ్ రాజు, మార్గాన గంగాధర్ రావు ,పితాని బాలకృష్ణ , చెల్లుబోయిన శ్రీను గారు పాల్గొన్నారు. అనంతరం ఎండియు వెహికల్ ఆపరేటర్స్ తో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్,కి వినతి పత్రం అందజేసారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Chirla Jaggi Reddy in

You cannot copy content of this page

Scroll to Top