కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మే 25 : హైడ్రా చేపట్టే చెరువులు కుంటలు నాళాల పరిరక్షణ ఫలితాలు భవిష్యత్తరాలకు తప్పకుండా ఉపయోగపడుతుందని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ అన్నారు. ప్రభుత్వం చేపట్టే ఏపథకమైనా పేదవాడికి లబ్ధి చేకూరేలా ఉంటుందన్నారు. స్థానికుల విజ్ఞప్తి మేరకు ఆదివారం రోజున నియోజకవర్గ పరిధిలోని బోయినపల్లి డివిజన్లో హస్మత్ పేట్ అంజయ్య నగర్ తదితర ప్రాంతాల్లో రమేష్ కాంగ్రెస్ నాయకులతో కలిసి విస్తృతంగా పర్యటించారు. ఇక్కడి బోయిన చెరువు సుందరి సుందరీకరణ పనులు జరుగుతున్నాయి.అయితే ఈ పేరుతో స్థానికులకు రహదారి లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని స్థానికులు రమేష్ కి మొరపెట్టుకున్నారు. దీంతో ఆయన ఇక్కడ పాదయాత్ర నిర్వహించారు. ఇక్కడ జరుగుతున్న చెరువు కట్ట అభివృద్ధి పనులను పరిశీలించారు. దీనిపై అక్కడే సంబంధిత అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.
చెరువు కట్ట సుందరీకారణ పనులను తమ స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఎప్పటినుంచో రహదారిగా ఉపయోగిస్తున్న ప్రాంతాన్ని మూసివేయవద్దని అలా చేయడంవల్ల స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులకు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పేద ప్రజల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఈ సమయంలో మేము ఎలాంటి పోరాటాలకైనా సిద్ధమే అన్నారు. అభివృద్ధి పనులు జరిగేటప్పుడు పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించబోదన్నారు. హైడ్రా తీసుకుంటున్న చర్యల వల్ల నిజంగా పేదవారికి ఎలాంటి నష్టం జరగ లేదన్నారు. రాజధాని నగరంలో చెరువులు కుంటలు నాలాల పరిరక్షణ ధ్యేయంగా హైడ్రా పనిచేస్తుందని దీని ఫలితాలు భవిష్యత్తులో తెలిసి వస్తాయన్నారు.
దీనితో పాటు రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న నాలాల్లో ముందుగానే పూడికతీత పనులు చేపట్టి వరద నీరు సక్రమంగా వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. నియోజకవర్గ ప్రజలకు తను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని స్థానిక సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామని రమేష్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు దండగుల యాదగిరి, డివిజన్ ప్రెసిడెంట్ మల్లికార్జున్ యాదవ్, లక్ష్మయ్య, కనకరాజు యాదవ్, ఏ ఏం సి డైరెక్టర్ రాజేందర్, షహేన్షా, అంజద్, ఆనంద్, ఏ ఏం సి డైరెక్టర్ అస్లాం, మురళి గౌడ్, అశోక్, గౌస్, అక్రమ్, అంజి, సందీప్, అంకమ్మ రావు, రాములు, రమేష్, గోపాల్, మరియు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


